సోనియా గాంధీకి కంగనా లేఖాస్త్రం

Update: 2021-12-01 07:26 GMT
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హీరోయిన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సారి కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీకి లేఖ రాసింది. చాలా ఘాటుగా అందులో పేర్కొంది. కంగనా రనౌత్ ను పంజాబ్ కు చెందిన ఒక వ్యక్తి చంపేస్తానంటూ బెదిరించాడు. ఇప్పటికే ఆ విషయమై కంగనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొత్త వ్యవసాయ చట్టాలకు మద్దతుగా కంగనా మాట్లాడినందుకు గాను ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎంత బెదిరించినా కూడా కంగనా మాత్రం తాను అనుకున్న విషయానికి నిలబడింది.. ఆమె తాను చివరి వరకు కూడా మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన రైతు కొత్త చట్టాలను సమర్ధిస్తూనే వచ్చింది.

ఇటీవల మోడీ ప్రభుత్వం కొత్త సాగు చట్టాలను వెనక్కు తీసుకోవడం జరిగింది. ఆ చట్టాల వల్ల లాభం అంటూ కంగనా ప్రచారం చేస్తూ వచ్చింది. కాని కొందరు రైతులు మాత్రం ఆ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆ చట్టాలను వ్యతిరేకించిన వారు కంగనా రనౌత్‌ ను పలు సందర్బాల్లో విమర్శించారు. అందులో భాగంగా ఒక పంజాబ్‌ వ్యక్తి కంగనా పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. రైతులకు వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తామంటూ హెచ్చరించారు.

తనను చంపేస్తానంటూ బెదిరించిన వ్యక్తిపై ఇప్పటి వరకు సోనియా గాంధీ కనీసం స్పందించలేదు అంటూ కంగనా పేర్కొంది. తనను బెదిరించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ లేఖ లో కంగనా డిమాండ్ చేసింది. సోనియా గాంధీ ఈ విషయమై స్పందించాల్సిందే అంటూ డిమాండ్ చేసింది. కంగనా రనౌత్ ఈ విషయాన్ని మళ్లీ రెచ్చ గొట్టేలా వ్యవహరిస్తుంది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సోనియా గాంధీ ని ఈ విషయంలోకి లాగడం వల్ల ఆమె పబ్లిసిటీ కోరుకుంటుందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.



Tags:    

Similar News