తూటాల్లాంటి మాటలతో సూటి గా గుచ్చేస్తూ సెగలు పుట్టించడంలో, ప్రత్యర్థి పై హుంకరిస్తూ నాలుక మడతపెట్టడంలో క్వీన్ కంగనను కొట్టేవాళ్లే లేరు. అందుకే ఆవిడకు క్వీన్ కిరీటం తగిలించారు. కేవలం నటనతోనే కాదు, ఫైర్ బ్రాండ్ యాటిట్యూడ్ తోనూ సువిశాల బాలీవుడ్ సామ్రాజ్యాన్ని ఏకైక మహారాణిగా ఏల్తోంది! రగిలే కుబుసంలా భగభగ మండుతూ ఇప్పుడు ఝాన్సీరాణిలా అవతరిస్తోంది.
కంగన నటించిన `మణికర్ణిక- ది క్వీన్ ఝాన్సీ` జనవరి 25న రిలీజవుతోంది. ఈ సందర్భంగా ప్రచారం పరంగా వేడి పెంచింది కంగన. ఈ చిత్రానికి క్రిష్ తో పాటు డైరెక్టర్ క్రెడిట్ కొట్టేసిన కంగన ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతోంది. నన్ను విమర్శించిన వాళ్లంతా నోర్మూసుకుంటారు బాంచత్! అంటూ ఫిరంగుల్ని .. బుల్లెట్లను పేల్చింది.
నా గురించి చెడ్డగా మాట్లాడేవాళ్లందరికీ ఇదే నా సమాధానం. నోళ్లు మూయిస్తా బాంచత్! అని వార్నింగ్ ఇచ్చింది. నా సినిమ చూశాక ఆ మాట మీరే చెబుతారు.. అంటూ క్వీన్ ప్రచారం చేసుకుంటోంది. ఎవరైతే నా గురించి మంచిగా మాట్లాడారో వాళ్లెవరూ నోళ్లు మూసుకోవాల్సిన పనేలేదు! అంటూ తనదైన చాతుర్యాన్ని ప్రదర్శిస్తోంది. వివాదంతో ప్రచారాన్ని ఝాన్సీ రాణి కూడా కోరుకుంటోందని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ `మణికర్ణిక` విషయంలో దుష్ప్రచారం చేసిన గుంపు ఎక్కడ? ఈ గుంపులో ఎవరెవరు ఉన్నారు? వినబడుతోందా భయ్యా? నోర్మూయిస్త బాంచత్!!