ఆ మధ్యన హీరోయిన్ కంగనా రనౌత్ వీడియో ఒకటి లీక్ అయ్యింది తెలుసుగా. ఆ వీడియోలో అమ్మడు తనకు బాడీ డబుల్ ను సిద్దం చేశామని ఒక అసిస్టెంట్ డైరక్టర్ చెప్పడంతో.. ఏకంగా ఫ.. అంటూ చేతిలో ఉన్న స్ర్కిప్ట్ పేపర్ విసిరేసి మరీ వెళ్లిపోయింది. అయితే ఈ వీడియోలో నిజమెంతా.. అసలు ఎందుకు కంగనా అలా చేసింది అంటూ బాలీవుడ్ లో చాలా కహానీలే వినిపించాయి.
అయితే ఈ వీడియో గురించి అడిగితే.. అందరిలా ఇది నా వీడియో కాదు.. ఎవరో గ్రాఫిక్స్ చేశారు.. సౌండ్ మార్చారు.. అంటూ కామెడీలు చేయకుండా.. ''అవును ఇది నాదే'' అంటూ తన స్పీచ్ స్టార్ట్ చేసింది కంగనా రనౌత్. ''ఆ వీడియోలో ఉన్నది నేను. అవును నేను అరుస్తున్నాను. నాకు బాడీ డబుల్ తో సీన్ చేయించడం ఇష్టం ఉండదు. ఏదైనా కూడా నేనే చేస్తా. అది రంగూన్ సినిమా షూట్ కాదు. ఒక అడ్వర్టయిజ్మెంట్ షూటింగ్. ఆ యాడ్ షూట్ పూర్తి చేశాను కాని.. వాళ్ల ప్రొడక్షన్ స్టయిల్ నాకు నచ్చలేదు'' అంటూ చెప్పేసిందీ క్వీన్ లేడీ.
మొత్తానకి సూపర్ హానెస్టీ ఉన్న హీరోయిన్ కంగనా అని చెప్పక తప్పడం లేదు. ప్రస్తుతం రంగూన్ వంటి టాప్ క్లాస్ సినిమాల్లో నటిస్తున్న కంగన.. మొన్న ఉమెన్స్ డే సందర్భంగా మాట్లాడుతూ.. ''అసలు నన్ను మా ఇంట్లో ఒక అనవసరంగా పుట్టిన ప్రాణంలా చూశారు.. హీనాతి హీనమైన బాల్యంను అనుభవించా'' అంటూ విలపించింది. ఆ దెబ్బకు మరోసారి అందరూ స్టన్ అయ్యారు.