ఐటెమ్ సాంగ్స్ బ్యాన్ చేయ‌మంటోంది

Update: 2018-04-05 12:59 GMT
కంగనా ర‌నౌత్‌... బోలెడంత టాలెంట్ తో పాటు అంతే రేంజ్ లో పిచ్చి కూడా ఉన్న న‌టి. ఏ మాత్రం భ‌యం.. భ‌క్తీ లేకుండా ఉన్న‌ది ఉన్న‌ట్టుగా మాట్లాడే ఈ బోల్డ్ బ్యూటీ... బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ తో ప్రేమాయ‌ణం న‌డిపి... ఆ త‌ర్వాత గొడ‌వ‌ప‌డి నానా ర‌చ్చ చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు కుర్ర‌కారు షాక్ తినే కామెంట్ చేసింది కంగ‌నా. బాలీవుడ్ లో ఐట‌మ్ సాంగ్స్ ని బ్యాన్ చేయాలంటోంది.

స్టార్ హీరోల సినిమాల్లో ఐట‌మ్ సాంగ్స్ ఉండ‌డం ఎప్ప‌టి నుంచో వ‌స్తున్న ఆన‌వాయితీ. చిన్న చిత‌కా సినిమాలకీ కాసింత క్రేజ్ వ‌స్తుందంటే కారణం కూడా కొన్ని ఐట‌మ్ సాంగ్సే. అలాంటి ఐటెమ్స్ సాంగ్స్ వెంట‌నే నిషేధించాల‌ని అంటోంది కంగ‌నా ర‌నౌత్‌. ఆమె ఓ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతూ... ‘‘ నాకు స్టార్ హీరోల మ‌సాలా సినిమాలు న‌చ్చ‌వు. తెల్ల‌గా అవ్వ‌డానికి ఈ క్రీములు పూసుకోండి... ఆ క్రీములు పూసుకోండి అని చెప్పే ఫెయిర్ నెస్ బ్రాండులూ న‌చ్చ‌వు. అలాగే నేనెప్పుడూ ఐటెమ్ సాంగ్స్ లో న‌టించ‌ను గాక న‌టించ‌ను...’’ అని చెప్పింది కంగనా. అంత‌టితో ఆగ‌కుండా ఐట‌మ్స్ సాంగ్స్ వ‌ల్ల అశ్లీల‌త పెరుగుతుంద‌ని... వారి ప‌ట్ల‌ శారీర‌క వాంఛ పెరుగుతుందని వెంట‌నే ప్ర‌భుత్వం వాటిని బ్యాన్ చేయాల‌ని అంది.

నేను ఐట‌మ్స్ సాంగ్స్ చేయ‌ను అంటే బానే ఉంది కానీ మొత్తానికి సినిమాల్లోంచి ఐట‌మ్స్ సాంగ్స్ తీసేయాల‌నడం క‌రెక్ట్‌ కాద‌ని వాపోతున్నారు కుర్ర‌కారు. క‌రీనా- మాధురీ దీక్షిత్‌- ఐశ్వ‌ర్యా రాయ్‌- ప్రియాంక చోప్రా లాంటి స్టార్ హీరోయిన్లంతా ఐట‌మ్ సాంగ్స్‌లో న‌టించిన వాళ్లే. అంతేందుకు ఇప్పుడు బాలీవుడ్ స్టార్ స్టేట‌స్ అనుభ‌విస్తున్న స‌న్నీ లియోనీకి ఆ స్టేట‌స్ రావ‌డానికి కార‌ణ‌మూ ఐట‌మ్ సాంగ్సే... అంటున్నారు సినీ జ‌నాలు. ఐటెమ్ సాంగ్స్‌లో అశ్లీల‌త ఉంటుందంటున్న కంగ‌నా... ఎన్ని సినిమాల్లో యువ‌త‌ను రెచ్చ‌గొట్టేలా క‌నిపించిందో గుర్తు చేసుకోవాల‌నుకుంటున్నారు మ‌రికొంద‌రు.
Tags:    

Similar News