కస్సుమన్నారు..కలిసిపోయారు

Update: 2018-01-11 05:44 GMT
సినిమా పరిశ్రమలో అంతే. ఒకసారి మాటలతో యుద్ధం చేసుకుంటారు. మరోసారి మమతలతో ప్రేమ కురిపించుకుంటారు. కాని ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో మాత్రం ముందే చెప్పలేం. ఇప్పుడు బాలీవుడ్ లో ఒక దర్శకుడికి - హీరొయిన్ కు మధ్య జరుగుతున్న వ్యవహారం గమనిస్తే అదే అనిపించక మానదు. బాలీవుడ్ సినిమాల  దర్శకుడు - నిర్మాత కరణ్ జోహార్ కు - హీరొయిన్ కంగనా రౌనత్ కు అంతగా సత్సంబంధాలు లేవు. నెపోటిజం(వారసత్వం) గురించి గతంలో కంగనా గతంలో కొన్ని వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ కి వారసులుగా వచ్చిన వారు దాన్నొక మాఫియాగా మార్చేశారని, ఎంతసేపు వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవరిని రానివ్వకుండా శాశిస్తున్నారని కాస్త ఘాటుగానే కామెంట్స్ చేసింది. ఇవి అక్కడ పెను దుమారాన్నే రేపాయి. ముఖ్యంగా ఈ విషయాన్ని పర్సనల్ గా తీసుకున్న కరణ్ జోహార్ కూడా కంగనా మీద కౌంటర్స్ వేయడంతో ఆపకుండా ఇంకా ముందుకు తీసుకెళ్ళాడు

వివిధ అవార్డులకు సంబంధించి జరిగిన వేడుకల్లో నేరుగా స్టేజి మీద కంగనాను టార్గెట్ చేసి కామెడీ చేయటం - ఈ ఇష్యూ లో సైఫ్ అలీ ఖాన్ - వరుణ్ ధావన్ లాంటి హీరోలు రావడం మొదలైన కారణాల వల్ల ఇది బాగా ముదిరి కొద్ది రోజులు మీడియాలో దీని గురించి పెద్ద చర్చే జరిగింది. కరణ్ - కంగనా వీలు దొరికినప్పుడల్లా మాటా మాటా అనుకున్నారు. కాని ఇప్పుడు అవన్నీ తూచ్ అనుకోని ఇద్దరు కలిసి రాజీ పడ్డారు అనే వార్త ఫాన్స్ ని నిశ్చింతపరిచేలా చేసింది. ఆ గొడవను మర్చిపోయి కలిసిపోదాం అని డిసైడ్ అయ్యారట.

కరణ్ జోహార్ జడ్జ్ గా వ్యవహరిస్తున్న 'ఇండియాస్ నెక్స్ట్ సూపర్ స్టార్' షోకి స్పెషల్ గెస్ట్ గా రావడానికి కంగనా ఓకే చెప్పిందట. దీన్ని నిర్మిస్తున్న సంస్థ ఇద్దరి దగ్గర ప్రపోజల్ పెట్టినప్పుడు గతం గత అనేసుకుని ఒప్పుకున్నారట. కంగనా రౌనత్ ప్రస్తుతం మణికర్ణిక షూటింగ్ లో ఉంది. తెలుగు దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న ఈ మూవీ ఝాన్సీ లక్ష్మి బాయ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. సమ్మర్లో విడుదల కానున్న ఈ మూవీపై అన్ని బాషల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. గౌతమి పుత్ర శాతకర్ణితో మంచి సక్సెస్ అందుకున్న క్రిష్ కంగనా రౌనత్ వీరనారిగా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నట్టు టాక్.
Tags:    

Similar News