ప్రస్తుతం బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రం మణికర్ణిక:ద క్వీన్స్ ఆఫ్ ఝాన్సీ. ఝాన్సీ రాణి బయోపిక్ గా టాలీవుడ్ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. బాహుబలి తర్వాత కె. విజయేంద్రప్రసాద్ ఈ కథను అందించాడు. ప్రస్తుతం ఈ సినిమాపై బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అంతే కాకుండా కంగాన రనౌత్ ఝాన్సీ రాణి పాత్రలో కనిపిస్తుండడంతో బిజినెస్ కూడా భారీ స్థాయిలో ఉంటుందని ఇప్పటికే సినీ అనలిస్ట్ లు అంచనాలను వేస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమా యొక్క క్రేజ్ ఏ విధంగా ఉందంటే.. సినిమా షూటింగ్ ఎంత సీక్రెట్ గా జరిపినా కూడా సెట్స్ లోని ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. లాస్ట్ వీక్ కూడా ఇదే తరహాలో షూటింగ్ కి సంబందించిన ఫొటోస్ బాగా వైరల్ అయ్యాయి. గోల్డెన్ సారి లో కంగనా చాలా సింపుల్ గా కనిపించింది. ఇక రీసెంట్ గా మరికొన్ని ఫొటోస్ కూడా లీకవ్వడంతో మీడియాల్లో అనేక కథనాలు వెలువడుతున్నాయి.
గ్రీన్ కలర్ డ్రెస్ లో జైపూర్ లో వేసిన ఒక సెట్స్ లో కంగనా నడుచుకుంటు వెళుతోంది. ఎవరో కొన్ని పోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫొటోని చూస్తుంటే పాత్ర కోసం కంగనా చాలా మారింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతా బాగానే ఉంది కాని.. అసలు మనోళ్ళు కంగన ఫోటోలను లీక్ అవ్వకుండా కాపాడలేకపోవడమే ఇక్కడ విడ్డూరంగా ఉంది. ఆ మాత్రం సెక్యూరిటీ చూసుకోకపోతే ఎలాగయ్యా?
ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ త్వరలోనే కొన్ని భారీ యాక్షన్ సీన్స్ ని చిత్రీకరించనుందట. అందుకోసం కంగాన కూడా శిక్షణను తీసుకొంది. ఈ సినిమాలో సోను సూద్ - అంకిత లోఖండే కూడా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.