కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న `మణికర్ణిక` కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఇప్పటికే దర్శకత్వ బాధ్యతల నుంచి క్రిష్ తప్పుకున్నాడు. దీంతో ఆ రెస్పాన్సిబిలిటీని కంగనా తీసుకుంది. ఆ క్రమంలోనే సోనూసూద్తోనూ గొడవొచ్చింది. అది నచ్చని సోనూ నీకు... నాకు కుదరదంటూ తప్పుకున్నాడు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇప్పటికే సినిమా బాగా ఆలస్యమైంది. అనివార్య కారణాల వల్ల ముందు నుంచి షూటింగ్ ప్లానింగ్ ప్రకారం జరగకపోవడంతో ఖర్చు అంతకంతకు పెరిగిపోతోంది. ఇది నిర్మాతల్ని బెంబేలెత్తించిందని తెలుస్తోంది.
ఆ క్రమంలోనే మరో వేడెక్కించే అప్డేట్ వచ్చింది. తాజాగా సినిమా నిర్మాణం నుంచి నిర్మాతలలో ఒకరైనా సంజయ్ కుట్టి కూడా తప్పుకున్నట్లు సమాచారం. 70 కోట్లలో అనుకున్న `మణికర్ణిక` ఇప్పుడు 100 కోట్లు ఖర్చు అవుతుందని కంగన అడ్డగోలుతనంతో చిక్కులొచ్చి పడ్డాయని నిర్మాత భావిస్తున్నారట. కంగన దర్శకత్వ బాధ్యతలు చేపట్టాక పెరిగిన బడ్జెట్‌ని కొత్తగా రివైజ్ చేసి మళ్లీ చెప్పిందిట.
ఇక లాభం లేదనుకుని...జరిగిందిందే జరిగిపోయిందని భావించి సంజయ్ కుట్టి కూడా తప్పుకున్నాడని బాలీవుడ్ సోర్సెస్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాణ బాధ్యతల్ని కొత్త వారు తీసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే వాళ్లెవరన్నది ఇంకా బయటకు రాలేదు. ఇప్పటికే షూటింగ్ ఆగిపోయిన నేపథ్యంలో తిరిగి ప్రారంభం అవ్వాలంటే కొత్త నిర్మాతలు రంగంలోకి దిగే వరకూ సెట్స్ కు వెళ్లడం కష్టమని తెలుస్తోంది. ఏ ముహూర్తన మణికర్ణిక ప్రారంభమైందో గానీ... అన్నీ కష్టాలే. కానీ కంగన మాత్రం ఆత్మ విశ్వాసం కోల్పోకుండా...ప్రాజెక్ట్ లో ఎవరున్నా.. లేకపోయినా తాను మాత్రం ముందుకు తీసుకెళ్తానని పట్టుదలతో ఉంది. కంగన కు నటి కాకముందు ఎన్నో చేదు అనుభవాలెన్నో. వాటి ముందు ఈ సమస్యలేవి పెద్దవి కావు. అందుకే ఇలా మొండిగా ముందుకెళుతోందన్నమాట!