సినిమాలు అంటే వివాదాలు సహజం అయిపోయాయి. ముఖ్యంగా చారిత్రక అంశాలపై తీసే చిత్రాలపై అయితే.. వివాదాలు మరింతగా ముసురుకుంటూనే ఉన్నాయి. రీసెంట్ గా దీపికా పదుకొనే నటంచిన పద్మావత్ మూవీపై ఏ స్థాయిలో గొడవలు జరిగాయో చూశాం. ఈ సినిమాలో రాజ్ పుత్ లను అవమానించారంటూ రాజ్ పుత్ కర్ణి సేన నానా హంగామా చేసింది.
చివరకు ఈ సినిమాను సపోర్ట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ వివాదం సినిమా సక్సస్ కు బాగానే హెల్ప్ అయింది. ఇప్పుడు ఇదే తరహా వివాదం కంగనా రనౌత్ నటిస్తున్న మణికర్ణిక పై మొదలైంది. రాణీ లక్ష్మీబాయ్ జీవితం ఆధారంగా కంగనా ప్రధాన పాత్రలో మణికర్ణిక రూపొందుతోన్న సంగతి తెలిసిందే. క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఇప్పుడీ మూవీపై సర్వ బ్రాహ్మిన్ మహాసభ వివాదాన్ని మొదలుపెట్టింది. ఈ చిత్రంలో రాణీ లక్ష్మీ బాయ్ కు.. ఓ బ్రిటిష్ వ్యక్తికి మధ్య సంబంధం ఉన్నట్లుగా చూపబోతున్నారంటూ సర్వ బ్రాహ్మిన్ మహాసభ ఆరోపిస్తోంది. ఓ బ్రిటిషర్ రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారని వారి వాదన.
ఝాన్సీ లక్ష్మీ బాయ్ గౌరవాన్ని భంగపరిచేలా సన్నివేశాలు తీస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. ఈ చిత్రంలో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు ఉండబోవని.. చరిత్రను వక్రీకరించే సమస్యే లేదని నిర్మాత కమల్ జైన్ చెబుతున్నారు. ఈమేరకు ప్రభుత్వానికి అఫిడవిట్ కూడా దాఖలు చేశామని అంటున్నారు.