15 కోట్ల పారితోష‌కం.. కంగ‌నా రెస్పాన్స్ ఇదే

Update: 2016-12-12 05:01 GMT
రెండు మూడు రోజులుగా బాలీవుడ్ న్యూస్ వెబ్ సైట్ల‌లో ఎక్క‌డ చూసినా ఒక‌టే చ‌ర్చ‌. బాలీవుడ్లో మ‌రే హీరోయిన్ ఎవ‌రూ ఇప్ప‌టిదాకా ట‌చ్ చేయ‌ని రెమ్యూన‌రేష‌న్ మార్కును నూడుల్స్ జుట్టు సుంద‌రి కంగ‌నా ర‌నౌత్ అందుకుంద‌న్న‌ది ఆ వార్త‌ల సారాంశం. కంగ‌న‌ త‌న కొత్త సినిమాకు ఏకంగా రూ.15 కోట్ల పారితోష‌కం డిమాండ్ చేసింద‌ని.. ఆమెకున్న డిమాండ్ చూసి అంత మొత్తం ఇవ్వ‌డానికి కూడా కొంద‌రు నిర్మాత‌లు రెడీ అవుతుంటే.. ఇంకొంద‌రు ఈ ఫిగ‌ర్ చూసి బెంబేలెత్తిపోతున్నార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

ఐతే ఈ రూమ‌ర్ విష‌యంలో వాస్త‌వ‌మేంటో తెలుసుకుందామ‌ని మీడియా వాళ్లు కంగ‌న‌నే అడిగేయ‌గా.. ఆమె త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చింది. ‘‘నేనెంత తీసుకుంటున్నా అన్న‌ది మీకే కాదు.. మిగ‌తా వాళ్లంద‌రికీ అన‌వ‌స‌రం. ఆ ఫిగ‌ర్ ఎంత‌న్న‌ది నాకు తెలిస్తే చాలు. నేనో సినిమాకు ఎంత తీసుకున్నా ఎవ‌రికేంటి బాధ’’ అంటూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసింది కంగ‌న‌. ప్ర‌స్తుతం కంగ‌నా రాణీ ల‌క్ష్మీభాయ్.. రంగూన్.. సిమ్రాన్ సినిమాల్లో న‌టిస్తోంది. కంగ‌నా నిజంగా సినిమాకు రూ.15 కోట్లు తీసుకుంటుంటే ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ ఆమే అవుతుంది. ‘ప‌ద్మావ‌తి’ సినిమాకు రూ.12 పుచ్చుకుని దీపికా ప‌దుకొనే ఇటీవ‌లే రికార్డు నెల‌కొల్పింది. ఆమెను కంగనా వెన‌క్కి నెట్టేస్తోంద‌న‌డంలో వాస్త‌వ‌మెంతో మ‌రి?
Tags:    

Similar News