ఫోటో టాక్‌: ఆచ్ఛాద‌న నిల‌వ‌నంది

Update: 2018-07-29 02:30 GMT
క్వీన్ కంగ‌న ర‌నౌత్ ఏం చేసినా సంథింగ్ స్పెష‌ల్‌ గానే ఉంటుంది. కెరీర్‌ లో ఈ అమ్మ‌డు చేయ‌ని ప్ర‌యోగ‌మే లేదు. ర్యాంప్ ఎక్కితే ప‌రిస‌రాలు గ‌జ‌గ‌జ ఒణ‌కాలి. రెడ్ కార్పెట్‌ పై న‌డిస్తే ఆ న‌డ‌క‌ల‌కు హంస‌లు సైతం బెద‌రాలి. ఫ్యాష‌న్‌ లో ప్యారిస్ సైతం వొంగి వొంగి స‌లాం చేయాలి. అంత ఉంది కాబ‌ట్టే, దూరంగా విసిరేసిన ఓ ప‌ల్లెటూరి నుంచి ప‌ట్నం వ‌చ్చి - ఏకంగా ఆర్థిక రాజ‌ధాని అయిన ముంబైని - ముంబై ప‌రిశ్ర‌మ‌ని ఏల్తోంది. బాలీవుడ్‌ లో రోబోగాళ్‌ గా న‌టించి మెస్మ‌రైజ్ చేసిన ప్ర‌తిభా పాఠ‌వం కంగ‌న‌కే సాధ్య‌మైంది. ఇప్పుడు ఏకంగా వారియ‌ర్ క్వీన్‌ గా వ‌చ్చి త‌డాఖా చూపించ‌బోతోంది. క్వీన్ ఝాన్సీ ల‌క్ష్మీ భాయ్ పాత్ర‌లో మెరుపులు మెరిపించ‌బోతోంది.

అదంతా స‌రే.. కంగ‌న ఎప్ప‌టిక‌ప్పుడు నిత్య‌నూత‌నంగా స‌రికొత్త ఫ్యాష‌న్స్ & ట్రెండ్స్‌ ని అనుస‌రిస్తూ  వేడి పెంచేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఇదిగో ఈ డ్రెస్ చూశారా?  కాస్త జోరుగా న‌డిస్తే జారిపోతుందేమో? అన్న‌ట్టు డిజైన్ చేశారు. అస‌లు ఉన్న‌ట్టుండి అలాంటిదేదో జ‌రిగితే సీనేంటో? అర‌కొర‌గా ఉన్న ఆ ఆచ్ఛాద‌న సైతం జారిపోతే స‌న్నివేశం ఎలా ఉంటుందో ఊహించండి. ఇలాంటి వార్డ్‌ రోబ్ స‌న్నివేశాలు హాలీవుడ్ - బాలీవుడ్‌ లో చాలా మంది గ‌తంలో ఫేస్ చేశారు. ఏదేమైనా ఈ డ్రెస్‌లో కంగ‌న మాత్రం హంస‌రాణిని త‌ల‌పించింది. మాన‌స‌స‌రోవ‌రం నుంచి పింక్ హంస ఇప్పుడే ఇలా దిగివ‌చ్చిందా.. అన్నంత అందంగా ఉంది మ‌రి!!



Tags:    

Similar News