వెన్ను నొప్పి బాధిస్తున్న షూటింగ్‌ కంటిన్యూ

Update: 2020-11-06 17:40 GMT
కొంత మంది స్టార్స్‌.. నటీనటులు చిన్న గాయం అయినా కూడా బాబోయ్‌ నా వల్ల కాదు ఇప్పుడు షూటింగ్‌ కు రావడం సాధ్యం కాదు అంటూ ఉంటారు అంటూ దర్శక నిర్మాతలు చెబుతూ ఉంటారు. కాని కంగనా రనౌత్‌ మాత్రం తీవ్రమైన వెన్ను నొప్పితో కనీసం అయిదు నిమిషాలు సరిగా నిల్చోవడం లేదా కూర్చోవడం కూడా సాధ్యం కావడం లేదట. అయినా కూడా ఆమె 'తలైవి' సినిమా షూటింగ్‌ లో పాల్గొంటుంది. ముందుగా అనుకున్న ప్రకారం సినిమాను పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ఎన్ని బాధలున్నా కూడా షూటింగ్‌ ను కంటిన్యూ చేస్తోంది.

తలైవి చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రస్తుతం ఈ విషయాన్ని మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. సినిమాల పట్ల ఆమెకు ఉన్న శ్రద్దకు ఇది నిదర్శణంగా అనిపిస్తుంది. నిజంగా కంగనా వృత్తి పట్ల ఉన్న నిబద్దతను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది అంటూ యూనిట్‌ సభ్యులు అంటున్నారు. కంగనా ఏ సినిమా చేసినా కూడా పూర్తిగా ఇన్వాల్వ్‌ అయ్యి మరీ చేస్తుంది. తనకు నచ్చిన పాత్ర కోసం ఎంత కష్టపడేందుకు అయినా రెడీగా ఉండే కంగనా ప్రస్తుతం తలైవి సినిమా కోసం ఎప్పుడు లేని విధంగా కష్టపడుతూ ఉంది. ఈ సినిమాకు విజయ్‌ దర్శకత్వం వహిస్తూ ఉండగా విష్ణు ఇందూరి నిర్మిస్తున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాది సమ్మర్‌ కు ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.
Tags:    

Similar News