బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కెరీర్ దూకుడు గురించి చెప్పాల్సిన పనే లేదు. వరుస కమిట్ మెంట్లతో యమ స్పీడ్ మీద ఉంది. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కీ.శే జయలలిలత బయోపిక్ `తలైవి` షూటింగ్ లో బిజీగా ఉంది. అమ్మ లుక్ కోసం.. క్లాసిక్ డేస్ ఆహార్యం కోసం అహర్నిశలు శ్రమిస్తూనే మరోవైపు చిత్రీకరణకు వెళుతోంది. తలైవి ఫస్ట్ లుక్ పోస్టర్ పై విమర్శలను తిప్పికొట్టాలని కంగన కంకణం కట్టుకున్నట్టే కనిపిస్తోంది. అమ్మ కాళ్లకు గజ్జ కట్టి..భరతనాట్యం చేస్తున్నట్లు ఉన్న ఓ ఫోటోని కంగన షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలో కంగన లుక్ అదిరిపోయింది. క్లాసిక్ డేస్ తలైవిని తలపించింది.
తాజాగా కంగన ఫోటో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. దేశంలో నే అతి పొడవైన చెన్నై మోరీనా బీచ్ లో కంగన అలలతో ఆటలాడుతోంది. తీరానికి దూసుకొస్తున్న అలలతో పోటీపడుతూ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లడం ఆసక్తిని కలిగించింది. సాగర తీరాన ఎగసి పడుతోన్న అలలు ఒడ్డుకు చేరుకునే సమయంలో కంగనను చూసి మరింత ఉగ్రరూపం దాల్చుతున్నాయి. సముద్రం నురుగుల గక్కుతుంది. చెన్నైలో చిత్రీకరణను ముగించుకుని పాండిచ్చేరి షూటింగ్ స్పాట్ కి వెళుతున్నప్పుడు తీసిన ఫోటో ఇది. కంగనా గ్రీన్ కలర్ పంజాబీ డ్రెస్సులో సింపుల్ గా కనిపిస్తోంది. నాడు క్లాసిక్ డేస్ తలైవి కూడా ఇలానే మెరీనా బీచ్ లో ఆటలాడుకునేదా? అనిపిస్తోంది ఈ లుక్ చూడగానే!
ఇక అమ్మ పాత్ర కోసం కంగన కాస్త బొద్దుగా మారిన సంగతి తెలిసిందే. ప్రాస్థటిక్ మేకప్ తో కొంతవరకూ కవర్ చేసే ప్రయత్నం చేస్తే విమర్శలు ఎదురయ్యాయి. మేకప్ వంద శాతం సూట్ కాలేదని ఫ్యాన్స్ విమర్శించారు. ఇక తాజా షెడ్యూల్ లో ఇప్పటికే చెన్నైలో కొంత భాగం చిత్రీకరణ పూర్తిచేసారు. ఈ చిత్రానికి ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ- మాటలు అందించారు.