నా ఖాతాను సస్పెండ్‌ చేయించే కుట్ర జరుగుతోంది

Update: 2020-08-18 09:30 GMT
బాలీవుడ్‌ లో ఉన్న స్టార్‌ వారసులపై కొందరు ప్రముఖులపై కంగనా రనౌత్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంది. సుశాంత్‌ మృతి తర్వాత ఆమె ఆరోపణలు మరీ ఎక్కువ అయ్యాయి. బాలీవుడ్‌ లో ఉన్న ఆ మాఫియా కారణంగానే సుశాంత్‌ చనిపోయాడు అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు ఆమె చేస్తున్న వ్యాఖ్యలు పలువురు సినీ వర్గాల వారికి తల నొప్పిగా మారాయి. సోషల్‌ మీడియా వేదికగానే కాకుండా మీడియా ముందు ఆమె మాట్లాడుతున్న మాటలు బాలీవుడ్‌ వర్గాల వారికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. దాంతో కొందరు ఆమె సోషల్‌ మీడియా అకౌంట్స్‌ సస్పెండ్‌ అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

కంగనా ట్విట్టర్‌ అకౌంట్‌ ను కొన్ని వేల మంది సస్పెండ్‌ కొట్టారట. అది బాలీవుడ్‌ మాఫియా పిలుపు మేరకు జరిగిందని ఆమె ఆరోపిస్తుంది. తన ట్విట్టర్‌ అకౌంట్‌ ను సస్పెండ్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వారికి నేను చేస్తున్న వ్యాఖ్యలు నష్టంను కలిగిస్తున్న కారణంగా ఈ పని చేస్తున్నారేమో అంటూ ఆమె వ్యాఖ్యలు చేసింది. తనపై ఎన్ని కుట్రలు పన్నినా కూడా తన అభిప్రాయాలను చెప్పేందుకు ఎప్పుడు కూడా వెనుకాడను అంటూ చెప్పుకొచ్చింది.

బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్‌ ప్రతిభ లేకున్నా స్టార్స్‌ అవుతున్నారు అవార్డులు అందుకుంటున్నారు. ఈ విషయాలను నేను చెప్పడం వల్లే నా అకౌంట్‌ ను సస్పెండ్‌ చేసేందుకు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారంటూ కంగనా వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌ లో ఉన్న నెపొటిజంకు వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని ఈ సందర్బంగా ఆమె క్లారిటీ ఇచ్చింది.
Tags:    

Similar News