బాలీవుడ్ హీరోయిన్ కంగన మంచి నటే కాదు స్ట్రాంగ్ లేడీ కూడా. బ్యూటీ విత్ బ్రెయిన్ అంటారుగా ఆ కోవలోకే వస్తుంది. ఏ టాపిక్ అయినా నిర్భయంగా మాట్లాడుతుంది. అలా మాట్లాడితే వివాదాలు వస్తాయని ఏం భయపడదు. జంకూ గొంకూ లేకుండా తనమనసుకు ఏది అనిపిస్తే అదే ఫైనల్ అన్నట్టుగా దుమ్ము దులుపుతుంది. తాజాగా ఈ బాలీవుడ్ క్వీన్ రెమ్యునరేషన్ ఒక హాట్ టాపిక్ అయింది.
సాధారణంగా కంగనా ఒక సినిమాకు రూ. 5 - 6 కోట్ల మధ్యలో తీసుకుంటుందట. కానీ 'మణికర్ణిక' సినిమాకు రూ. 14 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈలెక్కన కంగన హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే టాప్ హీరోయిన్స్ లిస్టు లో చేరినట్టే. ఆ లిస్టు లో ప్రస్తుతం దీపిక మాత్రమే ఉంది. ఆమె తన చివరి చిత్రం 'పద్మావత్' కు దాదాపు ఇదే రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుందని.. ఆ సినిమాలో నటించిన షాహిద్ కపూర్ - రణవీర్ సింగ్ ల కంటే దీపిక రెమ్యునరేషన్ ఎక్కువని వార్తలు వచ్చాయి. ఇప్పుడు కంగన కూడా లీడ్ రోల్ లో నటిస్తూ రెమ్యూనరేషన్ విషయం లో సంచలనం సృష్టించింది.
ఇక రాణి లక్ష్మిబాయి పాత్రలో నటించిన 'మణికర్ణిక' జనవరి 25 వ తారీఖు న రిపబ్లిక్ డే వీకెండ్ లో రిలీజ్ కానుంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు కొంతభాగం పెండింగ్ షూట్ మాత్రం కంగన దర్శకత్వంలో జరిగింది. ఇప్పటికే ప్రోమోస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'మణికర్ణిక' కంగన స్టార్డం ను మరింతగా పెంచడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.