సల్మాన్ దేవుడు కంగననూ కరుణించాడు

Update: 2015-08-17 11:49 GMT
బాలీవుడ్ లో చాలామందికి సల్మాన్ అంటే దేవుడే. అతడికి ఐదేళ్ల జైలు శిక్ష పడ్డప్పుడు చూడాలి.. అతడి భక్తులు ఎంతగా తల్లడిల్లిపోయారో. సల్మాన్ మాటంటే బాలీవుడ్ జనాలకు వేదం. అతడి పేరు చెప్పుకుని బతికే వాళ్లకు లెక్కే లేదు. బాలీవుడ్డోళ్లు చెప్పేవన్నీ నిజాలో అబద్దాలో అర్థమై చావవు కానీ.. అప్పుడప్పుడూ సల్మాన్ గురించి విచిత్రమైన వార్తలొస్తుంటాయి. సల్మాన్ మాకు ఆ అవకాశం ఇప్పించాడు.. ఈ అవకాశం ఇప్పించాడంటూ అక్కడి వాళ్లు భలే కబుర్లు చెబుతుంటారు. ‘బ్రదర్స్’ సినిమాలో డీగ్లామరస్ రోల్ అన్నపుడు తాను ఒప్పుకోలేదని.. సల్మానే తనను ఒప్పించి నటింపజేశాడని.. ఇంత మంచి పాత్ర తన చేయించిన ఘనత సల్మాన్ దే అంటూ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ మధ్య సల్మాన్ దేవుడిపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

ఐతే జాక్వెలిన్ లాంటి వాళ్లు ఇలాంటి మాటలు మాట్లాడటంలో ఆశ్చర్యమేమీ లేదు కానీ.. ఎవరి మాటా లెక్కచేయని కంగనా కూడా సల్మాన్ గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేయడం విశేషం. కంగనా కొత్త సినిమా ‘కట్టీ బట్టీ’ అవకాశం సల్మాన్ ఇప్పించిందేనట. ఈ కథ నీకు బాగుంటుంది అంటూ సల్మానే కంగన దగ్గరకు స్క్రిప్టు పంపించాడట. ‘‘క్వీన్ సినిమా తర్వాత నాకు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ వరుస కట్టాయి. వాటిలో ఏది ఎంచుకోవాలో తెలియక తికమకపడుతున్న సమయంలో సల్మాన్ కట్టీ బట్టీ సినిమా స్క్రిప్టు నా దగ్గరికి పంపారు. కథ విన్నాక నిమిషం కూడా ఆలోచించకుండా ఒప్పేసుకున్నా’’ అని చెప్పింది కంగ. మొత్తానికి సల్మాన్ దేవుడు కంగననూ కరుణించాడన్నమాట.
Tags:    

Similar News