ఆంధ్రప్రదేశ్ - విశాఖ పట్నంలో రెండు రోజుల పాటు నేవీ పండుగ జరుగుతోంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు బాలీవుడ్ భామ కంగనా రనౌత్ గెస్ట్ ఆఫ్ ఆనర్ గా హాజరు కానుంది. గతేడాది కూడా దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని ఈమె దక్కించుంది. లండన్ లో జరిగిన ఉమెన్ వరల్డ్ సమ్మిట్ కు కూడా హాజరైంది. మరో అరుదైన గౌరవం కూడా కంగనాకు దక్కుతోంది.
'ఇండియన్ నేవీ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మ ఈవెంట్ లో ప్రధాని నరేంద్ర మోడీ - కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ లు కూడా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు - గవర్నర్ నరసింహన్ లతో కలిసి.. ఫిబ్రవరి 6న జరిగే సెయిలింగ్ ఈవెంట్ కు కంగన రనౌత్ హాజరవుతోంది ' అంటూ ఆమె సన్నిహత వర్గాలు వెల్లడించాయి.
ఈ కార్యక్రమానికి కంగనాను నాలుగు నెలల క్రితమే ఆహ్వానించారని తెలుస్తోంది. అయితే సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఇన్నాళ్లూ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు. 10వేల మంది ఆఫీసర్లు, సెయిలర్లు పాల్గొననున్న ఈ ఈవెంట్ కు తాను గెస్ట్ ఆఫ్ ఆనర్ గా వెళ్తుండడంపై కంగన చాలా సంతోషంగా ఉంది.