కనిక కోవెలమూడి థిల్లాన్.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ కోవెలమూడి భార్య ఈమె. ప్రతిభావంతుల కుటుంబంలో ఉన్న ఈమె.. స్వయంగా కూడా మల్టీ ట్యాలెంటెడ్. గతేడాది అనుష్క ప్రధాన పాత్రలో విడుదల అయిన సైజ్ జీరో మూవీకి స్క్రీన్ ప్లే రైటర్ కనిక. మరికొన్ని బాలీవుడ్ సినిమాలకు కూడా స్క్రీన్ ప్లే రైటర్ వర్క్ చేసిన ఈమె.. స్వతహాగా పుస్తక రచయిత.
కనిక రాసిన మొదటి పుస్తకం బాంబే డక్ అండ్ ఫిష్. సినీ పరిశ్రమపై రాసిన సెటైర్ కామెడీ ఇది. ఈ బుక్ బాగా క్లిక్ కావడంతో మళ్లీ అదే జోనర్ లో బుక్స్ రాయాలని చాలానే ఆఫర్స్ వచ్చాయట. అందరూ ప్రోత్సహించినా ఓ శ్రేయోభిలాషి మాత్రం.. మరో సెటైర్ బుక్ రాయడం అంటే కెరీర్ సూసైడ్ తో సమానం అని చెప్పడంతో వెనక్కి తగ్గిందట కనిక. ఆ తర్వాత శివ అండ్ ది రైజ్ ఆఫ్ షాడోస్ అనే పుస్తకంతో పాఠకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు తన మూడో పుస్తకాన్ని కూడా సిద్ధం చేసింది దర్శకేంద్రుడి కోడలు.
ఈ లేటెస్ట్ బుక్ పేరు 'ది డ్యాన్స్ ఆఫ్ దుర్గ'. ప్రేమ - నమ్మకాలను తిరిగి సమీక్షించుకునే కేరక్టర్ చుట్టూ ఈ కథ సాగుతుంది. రచయితగా తన కెరీర్ చాలా బాగుందని, స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా బోలెడు అవకాశాలు వస్తున్నాయని ఈమె చెబుతోంది. గతంలో షారూక్ ఖాన్ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టెయిన్ మెంట్స్ కు పని చేసిన అనుభవం కూడా ఈమెకు ఉంది.