రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి భార్య కనికా థిల్లాన్ టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్ద పరిచయం లేదు కానీ బాలీవుడ్ జనాలకు బాగా సుపరిచితమే. అక్కడ షారుఖ్ ఖాన్ 'రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్' బ్యానర్ కు, ఈమెకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఇప్పుడు ఈమె చేతిలో ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి వచ్చిపడింది.
బాలీవుడ్లో సూపర్ హిట్ చిత్రాలు ఓం శాంతి ఓం - రావణ్ లాంటి సినిమాలకు సహ రచయితగానే కాకుండా ప్రొడక్షన్ వ్యవహారాలు కూడా చూసుకునేది. తర్వాత ప్రకాష్ ను పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో సెటిల్ అయిపోయింది. ఎలాగైనా తన భర్త కు ఒక హిట్ అందించాలని సైజ్ జీరో స్క్రిప్ట్ కూడా రాసింది. సినిమా ప్రకాష్ బాగానే తీసాడు కానీ అది ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోయేసరికి ఆ సినిమా ప్లాప్ అయిపోయింది. టాలీవుడ్ పెద్దగా సెట్ కాలేదని బాలీవుడ్ కి మకాం మార్చేశారు ఈ జంట.
అక్కడ ప్రకాష్ మెంటల్ హై క్యా సినిమాతో తన టాలెంట్ నిరూపించుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా కనికా ఒక పెద్ద ప్రాజెక్ట్ కి స్క్రిప్ట్ సమకూర్చుతోంది. అదే మన్ మర్జియా. అభిషేక్ బచ్చన్ అండ్ తాప్సీ హీరోహీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తీస్తున్నాడు. అనురాగ్ సినిమాకు స్క్రిప్ట్ ఇవ్వడం అంటే పెద్ద విషయమే కదా మరి. ఇకపోతే మెంటల్ హై క్యా సినిమాకు కూడా ఈమే రైటర్.