కనికాను వదలనంటున్న కరోనా...!

Update: 2020-03-25 13:00 GMT
కనికా కపూర్...కరోనా వైరస్ మనదేశంలోకి ప్రవేశించినప్పటి నుండి ఎక్కువగా వినిపిస్తున్న సెలెబ్రిటీ పేరు. కరోనా నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారు పద్నాలుగు రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలన్న నిబంధనలు ఉల్లంఘించి ఒక పార్టీకి హాజరై ప్రజలందరి కోపానికి గురైన సంగతి తెలిసిందే. ఆ పార్టీలో పాల్గొన్న తర్వాత ఆమె కరోనా వైరస్ బారిన పడి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పర్యవేక్షణలో సంజయ గాంధీ మెడికల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. కరోనా పాజిటివ్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన కనికా ప్రవర్తనకు విసిగిపోయి హాస్పిటల్ యాజమాన్యం కంప్లెయింట్ చేశారు అంటే ఈ సింగర్ వాళ్లని ఎంత ఇబ్బంది పెట్టిందో మరి. ఈ విషయంపై సీరియస్ అయిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కనికా కపూర్ పై హత్యారోపణల కింద అరెస్ట్ చేయడానికి వెనుకడబోమని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె గురించి మళ్లీ ఒక వార్త బయటకి వచ్చింది.

ఐసోలాషన్ లో ఉన్న కనికాకు ఇంతకు ముందు రెండు సార్లు కరోనా టెస్ట్ చేయగా రెండు సార్లు పాజిటివ్ వచ్చింది. తాజాగా మరోసారి కోవిడ్-19 నిర్ధారణ టెస్ట్ చేయగా మళ్ళీ పాజిటివ్ వచ్చిందని హాస్పిటల్ యాజమాన్యం తెలియజేసింది. ఆమె మరో రెండు సార్లు కోవిడ్ టెస్టులో పాజిటివ్ వచ్చే దాకా కనికాను డిశ్చార్జ్ చేయబోమని హాస్పిటల్ వారు ప్రకటించారు. ఇదిలా వుండగా ఆమెతో పాటు ఉండి కరోనా పాజిటివ్ లక్షణాలున్న ఆమె ఫ్రెండ్ కి మాత్రం టెస్టులో నెగిటివ్ వచ్చిందంట. అంతేకాకుండా ఆ పార్టీకి హాజరైన రాజకీయ నాయకులు, సెలెబ్రెటీలు మొదలైన వారందరిని ఐసోలేషన్ లో ఉంచగా అందరూ నెగటివ్ లక్షణాల తో బయటపడ్డారు. వైఏదేమైనా కనికా కపూర్ ని కరోనా వదిలిపెట్టడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News