కరోనా వైరస్ ప్రపంచాన్నంతా వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా ప్రపంచంలో వేలాదిమంది మరణించారు. ఇక దీని బారిన పడి చికిత్స పొందుతున్న వారు లక్షల్లో ఉన్నాయి. వారిలో బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు కూడా ఇటీవల కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. లండన్ నుంచి వచ్చిన ఆమె ఎయిర్ పోర్ట్ లో తన ట్రావెల్ హిస్టరీ దాచిపెట్టి ఫ్యామిలీ పార్టీకి హాజరై అందరిలో కలవరం రేపింది. దీంతో ఆమెను లక్నో నగరంలోని సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని ఐసోలేషన్ గదికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కనికాకు కరోనా పాజిటివ్ అని తెలియగానే ఆమెతో పార్టీకి హాజరైన వారంతా ఇప్పుడు ఐసోలేషన్‌లో ఉన్నారు. వారిలో కొంతమంది టెస్టులో నెగటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు.
అయితే కనికా కపూర్‌కు ఇప్పటికే మూడు సార్లు కరోనా వైరస్ టెస్టులో పాజిటివ్ రాగా, ఇప్పుడు నాలుగోసారి కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 'కనికా 10 రోజుల నుంచి చికిత్స తీసుకుంటున్నప్పటికీ కరోనా బారి నుంచి బయటపడడం లేదు. దీనిని బట్టీ ట్రీట్‌మెంట్‌కు కనికా స్పందించడంలేదని అర్థమవుతోంది. ప్రస్తుతం లాక్‌డౌన్ నడుస్తుండటంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను విదేశాలు కూడా తీసుకెళ్లలేం. ఆమె కోలుకోవాలని దేవుడిని ప్రార్థించడం తప్ప ఇంకేమీ చేయలేం’ అని కనికా కుటుంబ సభ్యుల్లో ఒకరు తెలిపారు. మరోవైపు కనికా పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు పాపం.. కనికాను కరోనా వదలడం లేదంటూ కామెంట్ చేస్తున్నారు.