తమిళంలో సూపర్ హిట్ అయిన 'జిగర్తాండ' చిత్రానికి రీమేక్ గా 'వాల్మీకి' చిత్రం రూపొందిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా వరుణ్ తేజ్ విలన్ గా అధర్వ హీరోగా కనిపించాడు. వరుణ్ తేజ్ ఈ చిత్రంలో చాలా కీలకమైన పాత్రలో కనిపిస్తాడని ఒక రౌడీ మంచి వాడిగా ఎలా మారాడు అనే విషయాన్ని ఈ చిత్రంలో చూపించడం జరుగుతుందని.. అందుకే దీనికి వాల్మీకి అనే టైటిల్ ను పెట్టినట్లుగా దర్శకుడు చెబుతూ వస్తున్నాడు.
టైటిల్ ప్రకటించినప్పటి నుండి కూడా బోయ సంఘం వారు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సినిమాకు వాల్మీకి అనే టైటిల్ ను తొలగించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల కేంద్ర సమాచార శాఖ మంత్రి వద్దకు వెళ్లి మరీ ఫిర్యాదు చేశారు. మరో రెండు రోజుల్లో సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ ఈ విషయమై స్పందించారు.

సినిమాకు 'వాల్మీకి' అనే పేరు పెట్టడం వల్ల కొందరి మనోభావాలు దెబ్బ తింటున్నాయని వారు చెబుతున్నారు. అందుకే వారి కోరిక మేరకు సినిమా టైటిల్ ను మార్చాలంటూ కన్నా డిమాండ్ చేశారు. అయితే ఇప్పటికే సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు సెన్సార్ కూడా క్లియరెన్స్ వచ్చిన కారణంగా చిత్ర యూనిట్ సభ్యులు టైటిల్ విషయమై ఆలోచిస్తున్నట్లుగా అనిపించడం లేదు. టైటిల్ విషయం గురించి పట్టించుకోకుండా ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు.