క‌న్న‌డ భామ ల‌క్కు ఇప్ప‌టికైనా మారేనా?

Update: 2022-10-21 02:30 GMT
క‌న్న‌డ సినిమా ప్ర‌స్తుతం యావ‌త్ దేశ వ్యాప్తంగా రీసౌండ్ ఇస్తూ సంచ‌ల‌నం సృష్టిస్తోంది. `కేజీఎఫ్‌` వంటి సంచ‌ల‌న సినిమా త‌రువాత క‌న్న‌డ‌చిత్ర ప‌రిశ్ర‌మ వైపు యావ‌త్ ఇండియా ఆశ్చ‌ర్యంగా చూస్తున్న విష‌యం తెలిసిందే.

`కేజీఎఫ్‌` అందించిన కాన్ఫిడెన్స్ తో క‌న్న‌డ నుంచి విడుద‌లౌతున్న సినిమాలు ఇప్ప‌డు మ‌రింత హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రీసెంట్ గా విడుద‌లైన `కాంతార‌` ఊహించ‌ని విధంగా మౌత్ టాక్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వైడ్ గా క‌న్న‌డ వెర్ష‌న్ వంద కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది.

తెలుగులోనూ అదే హ‌వాని కొన‌సాగిస్తూ ట్రేడ్ వ‌ర్గాల‌ని, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ ల‌ని సైతం విస్మ‌యానికి గురిచేస్తోంది. తెలుగులో ఇప్ప‌టికే ఈ మూవీ రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి చిన్న సినిమాల్లో తిరుగులేని రికార్డుని సొంతం చేసుకుంది. ఐదు రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 22 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి స్టిల్ అదే ఊపుతో ముందుకు సాగుతోంది.

ఇదిలా వుంటే ప్ర‌స్తుతం క‌న్న‌డ ఇండ‌స్ట్రీ టాక్ ఆఫ్ ది ఇండియాగా మారిన నేప‌థ్యంలో క‌న్న‌డ సోయ‌గం, కేజీఎఫ్ ఫేమ్ శ్రీ‌నిధి శెట్టికి టాలీవుడ్ లో క్రేజీ ఆఫ‌ర్లు ద‌క్కేనా అనే చ‌ర్చ మొద‌లైంది. `కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్ట‌ర్ 2`ల‌తో శ్రీ‌నిధి శెట్టి దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్‌ని సొంతం చేసుకుంది. అయితే ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవ‌డంలో మాత్రం దారుణంగా విఫ‌ల‌మ‌వుతున్న‌ట్టుగా తెలుస్తోంది. దీనికి కారణం ఆమె పీఆర్ టీమ్ అని కామెంట్ లు వినిపిస్తున్నాయి.

`కేజీఎఫ్` క్రేజ్ తో విక్ర‌మ్ తో క‌లిసి న‌టించిన `కోబ్రా` ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. అంతే కాకుండా త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన వారిని శ్రీ‌నిధి శెట్టి భారీగా పారితోషికం డిమాండ్ చేస్తోంద‌ని ఆ కార‌ణంగానే త‌ను క్రేజీ ఆఫ‌ర్ల‌ని సొంతం చేసుకోలేక‌పోతోంద‌ని, పీఆర్ టీమ్ కూడా వీక్ గా వుండ‌టంతో త‌న‌కు ద‌క్కాల్సిన అవ‌కాశాలు కూడా ద‌క్క‌డం లేద‌ని అంటున్నారు.

క‌న్న‌డ ఫిల్మ్ `కాంతార‌` తెలుగులో రికార్డు స్థాయి విజ‌యాన్ని సాధిస్తూ భారీ వ‌సూళ్ల‌ని రాబ‌డుతున్న వేళ టాలీవుడ్ లో క‌న్న‌డ స్టార్స్ కి మంచి డిమాండ్ పెరుతోంది. ఈ స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకుని శ్రీ‌నిధిశెట్టి తెలుగులో త‌న ల‌క్కుని ఇప్ప‌టికైనా మార్చుకుంటుందా? అన్న‌ది వేచి చూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News