జోడీ వెతుక్కున్న స్టార్ కమెడియన్

Update: 2017-03-19 05:56 GMT
స్టార్ కమెడియన్ కపిల్ శర్మ.. ఇప్పుడు టెలివిజన్ కామెడీకే బ్రాండ్ అంబాసిడర్ అనేంత గుర్తింపు సంపాదించేశాడు. ఒక్కో ఎపిసోడ్ కు 60 నుంచి 80 లక్షలు ఛార్జ్ చేస్తున్నాడంటే.. ఏటా ఇతడు కట్టే ఇన్ కం ట్యాక్స్ 15 కోట్ల రూపాయలు అంటే.. ఇతని సంపాదన ఏ స్థాయిలో ఉంటుందో అర్ధమవుతుంది.

మరోవైపు ఈ కమెడియన్ పర్సనల్ లైఫ్ పై మూడేళ్లుగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. గిన్ని ఛత్రత్ తో కపిల్ శర్మ ప్రేమలో ఉన్నాడని వాటి సారాంశం. జలంధర్ కు చెందిన ఈమె.. గతంలో హస్ బలియే రియాలిటీ షోలో.. కపిల్ తో కలిసి కామెడీ కూడా చేసింది. తాజాగా ఈమెతో ప్రేమను ధృవీకరిస్తూ.. ట్వీట్ పెట్టాడు కపిల్. ఓ అరగంటలో అందమైన విషయం చెబుతానంటూ టీజ్ చేసి.. ఆ తర్వాత గిన్ని ఛత్రత్ తో తను కలిసున్న ఫోటో ను పోస్ట్ చేసి 'తను నా బెటర్ హాఫ్ అని చెప్పను. పూర్తిగా తనే నేను. లవ్ యూ గిన్నీ. తనను ఆహ్వానించండి. నేను తనను ఎంతో ప్రేమిస్తన్నాను' అని ట్వీట్ చేసి.. అసలు విషయం చెప్పాడు కపిల్ శర్మ.

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే పై తన ప్రేమను గతంలో చాలా సార్లే చెప్పాడు కపిల్. ఇప్పుడు 'దీపు.. ఇప్పుడు నేను నిన్ను మిస్ అవుతున్నాను.. హహహహ.. నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను' అంటూ దీపికా పదుకొనేను ట్యాగ్ చేశాడు కపిల్ శర్మ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News