సరోగసి సంతానాన్ని పరిచయం చేసిన స్టార్

Update: 2017-08-08 07:01 GMT
ప్రస్తుతం భారతదేశ ప్రజలు ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న కొన్ని విధానాలను కొంచెం కొంచెంగా అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా సరోగసి (అద్దె గర్భం) పద్ధతిని  ఈ మధ్య చాలా మంది అనుసరిస్తున్నారు. పెళ్లి చేసుకొని వారికి, పిల్లలు లేని వారికి ఈ తరహా సరోగసి పద్ధతి వల్ల సంతాన తృప్తి కలుగుతోంది.

అయితే ఈ సరోగసి పద్దతిని ఈ మధ్య సెలబ్రెటీలు కూడా చాలావరకు మొగ్గు చూపిస్తున్నారు. అందులో ఒకరు కరణ్ జోహార్. బాలీవుడ్ లో దర్శకుడిగా మరియు నిర్మాతగానే కాకుండా మంచి ఫ్యాషన్ డిజైనర్ గా గుర్తింపు తెచ్చుకున్న కరణ్ టెలివిజన్ హోస్ట్ గా కూడా పాపులర్ అయ్యాడు. ఆయన బాహబలి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు. ఎందుకంటే బాహుబలి హిందీ వెర్షన్ ను బాలీవుడ్ లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక అసలు విషయంలోకి వస్తే  వివాహం చేసుకోకుండా ఆయన సరోగసి ద్వారా జన్మించిన తన ఇద్దరి పిల్లల పోటోలను  కరణ్ జోహార్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.

ఫీబ్రవరి లో సరోగసి పద్ధతిద్వారా  జన్మించిన ఒక ఆడపిల్లకు-మగపిల్లాడికి కరణ్ తండ్రయ్యారు. కొడుకుకి యష్ జోహార్ అని తన తండ్రి పేరు పెట్టుకోగా, కూతురికి రుహి అని నామకరణం చేశాడు. రాఖీ పండగ శుభాకాంక్షలు తెలుపుతూ.. పిల్లలతో తన తల్లి దిగిన ఫోటోను సోషల్ మీడియలో పోస్ట్ చేశాడు కరణ్ జోహార్.



Tags:    

Similar News