తనవరకూ వస్తే కాని తెలియదంటారు. తనకు కాలితే కాని బర్నల్ గొప్పతనం తెలిసిరాదంటారు. ఇంతకూ ఈ తొలిపలుకులు ఎవరికోసమంటే... బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ గురించి. కొంతమంది తనను జాతి వ్యతిరేకిగా ముద్రవేస్తోన్నారని, అందుకు చాలా బాదపడ్డానని, ఆ కారణంతోనే ఇన్నాళ్లూ బయటకు రాలేదని చెబుతున్నాడు ఈ ఫిల్మ్ మేకర్. పాకిస్థానీ నటుడు నటించిన "ఏ దిల్ హై ముష్కిల్" సినిమా విడుదలకు కావాల్సినన్ని సమస్యలు ఎదురు కావడంతో తన సినిమా విడుదలకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ వీడియో సందేశం ఒకటి పెట్టాడు. గతంలో పాక్ నటుల విషయంలో "కళాకారులు వేరు, దేశాల మధ్య గొడవలు వేరు" అని దైవాంశ సంభుతుడి తరహాలో వ్యాఖ్యానించిన కరణ్ ఇప్పుడు దిగివచ్చి... ఉగ్రవాదాన్ని గట్టిగా ఖండిస్తానని, మన సైన్యాన్ని గౌరవిస్తానని, అసలు తనకు దేశమే ముఖ్యమని చెబుతున్నాడు.
ఉరీ ఉగ్రదాడి అనంతరం పాక్ నటుల విషయంలో ముందుగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన సీరియస్ అయ్యింది. బాలీవుడ్ లో ఉన్న పాక్ నటులంతా 48గంటల్లో సర్ధుకుపోవాలని హెచ్చరించింది. అయితే ఈ విషయంపై అప్పట్లో కరణ్ జోహార్... తగ్గేది లేదన్నట్లుగా వ్యవహరించాడు. పాక్ నటులతో తీసిన సినిమా విడుదలకు సన్నాహాలు చేసుకున్నాడు. అయితే తాజాగా థియేటర్ల యజమానులు కూడా కరణ్ జోహార్ సినిమాని విడుదల చేయనివ్వమని చెప్పడంతో కాళ్ల బేరానికి వచ్చిన కరణ్... ఇక మీదట తాను పాకిస్థానీ నటీనటులతో సినిమాలు చేయబోనని ప్రకటించాడు. ఇదే సమయంలో తనతో 300 మందికిపైగా భారతీయులుకూడా పనిచేస్తున్నారని తన దేశభక్తిపై ఒక హింట్ వదిలాడు.
ఇంకా ఈ విషయాలపై మాట్లాడిన కరణ్... దేశభక్తిని ప్రదర్శించడానికి ఉత్తమ మార్గం ప్రేమను పంచడమేనని, తన సినిమాల ద్వారా అదే తాను చేస్తున్నానని అన్నాడు. "ఏ దిల్ హై ముష్కిల్" సినిమా తీసేటప్పటికి ఇరు దేశాల సంబంధాలు బాగానే ఉండేవని, భారత ప్రభుత్వం కూడా పాకిస్థాన్ తో స్నేహ సంబంధాల కోసమే ప్రయత్నించిందని కరణ్ తన వీడియో సందేశంలో చెప్పాడు. అయితే ప్రస్తుతం సెంటిమెంట్లు వేరుగా ఉన్నాయని, వాటిని తాను గౌరవిస్తానని అన్నాడు. అయితే ఈ వీడియో సందేశం ఎంతవరకు ఫలిస్తుందన్నది మాత్రం వేచి చూడాల్సిందే.
అయితే ఈ వీడియో సందేశం ఏదో ఆనాడే అందరికీ అర్ధమయ్యే రీతిలో కరణ్ ప్రకటించి ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చి ఉండేది కాదన్న అభిప్రాయం చాలామందిలో వ్యక్తం అవుతుంది. ఈ సినిమా మొదలయ్యే నాటికి ఇరుదేశాల మధ్య పరిస్థితులు బాగానే ఉన్నాయన్న కరణ్ వాదనలో న్యాయమున్నప్పటికీ... ఇచ్చుకున్న వివరణ, ఇచ్చిన సంజాయిషీ చాలా ఆలస్యం అయిపోయింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది! సంజాయిషీతో కూడిన ఈ వీడియో సందేశం ఎవరు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/