కార్గిల్ ధీరవనిత గాథతో బయోపిక్

Update: 2017-11-06 04:51 GMT
బాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్ ల హవా నడుస్తోంది. మిగిలిన అన్ని పిక్చర్లు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తుంటే బయోపిక్ బేస్డ్ మూవీస్ మాత్రం కాసులు కొల్లగొడుతున్నాయి. దీంతో బయోపిక్ లు తీయడానికి పనికొచ్చిన వ్యక్తులు ఎక్కడెక్కడ ఉన్నారా అని తెగ వెతుకుతున్నారు. తాజాగా బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ స్టోరీతో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా సినిమా షూటింగ్ అవుతోంది. మరోవైపు ఉమెన్ క్రికెట్ టీం కెప్టెన్ మిథాలీరాజ్ జీవితగాథతోనూ సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు.

ఇదే తీరులో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ లేటెస్ట్ గా ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి శౌర్యచక్ర పురస్కారం పొందిన లేడీ జీవితగాథను సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఆమె పేరు గుంజన్ సక్సేనా. హెలికాప్టర్ పైలట్ గా పనిచేసిన మొదటి ఇద్దరు మహిళల్లో ఒకరు. దేశ సరిహద్దుల్లో కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎంతో ధైర్యంగా హెలికాప్టర్ లపై ఆ ప్రాంతాలకు వెళ్లి హెలికాప్టర్ లో గాయపడిన సైనికులను తిరిగి తీసుకొచ్చి వారి ప్రాణాలను కాపాడింది గుంజన్ సక్సేనా. ఆమె తండ్రి - సోదరుడు కూడా సైన్యంలో పనిచేసినవారే. గుంజన్ పెళ్లి చేసుకున్నది ఎయిర్ ఫోర్స్ లో పైలట్ నే.

దేశ భక్తికి.. పోరాట పటిమ నిండి ఉన్న గుంజన్ కథ సినిమా తీయడానికి అన్నవిధాలుగా సరిపోతుందని కరణ్ బలంగా నమ్ముతున్నాడట. ఆ పాత్రలో హీరోయిన్ గా ఎవరిని ఎంచుకోవాలని అనే దానిపైనే ప్రస్తుతం కసరత్తు చేస్తున్నాడని కరణ్ టీం అంటోంది. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడమే తప్ప డైరెక్ట్ చేసే ఉద్దేశంలో కూడా కరణ్ లేడని టీం సభ్యులు అంటున్నారు.
Tags:    

Similar News