కరీనా కపూర్ కు కొడుకు పుట్టాడు

Update: 2016-12-20 06:55 GMT
మొత్తానికి డిసెంబర్ 20న డెలివరీ డేట్ అని ముందే ప్రకటించిన కరీనా కపూర్ ఖాన్.. అనుకున్న టైముకే ప్రసవించింది. ముంబయ్ లో ని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో పండంటి మగ బిడ్డకు అమ్మడు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది.

హీరో సైఫ్‌ ఆలీ ఖాన్.. కరీనా కపూర్ లు ఐదు సంవత్సరాలు పాటు డేటింగ్ చేసుకుని.. 2012లో పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం విరిద్దరూ తల్లిదండ్రులు స్టాటస్ కు అప్డేట్ అయ్యారు. పుట్టిన కొడుకుకు తైమైర్ ఆలీ ఖాన్ అని నామకరణం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే కరీనాకు కొడుకే పుడతాడని ఆల్రెడీ స్కానింగ్ చేయించారు అంటూ గతంలో రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అవే నిజమయ్యాయ్.

సైఫ్‌ ఆలీ ఖాన్ కు కరీనా 2వ వివాహం కాగా.. కరీనా ద్వారా పుట్టిన కొడుకు మూడవ సంతానం. మనోడికి మొదటి భార్య అమృతా సింగ్ నుండి ఇద్దరు పిల్లలున్నారు. వారిలో కూతురు సారా త్వరలోనే హీరోయిన్ గా తెరంగేట్రం చేయనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News