ప్రెగ్నెంట్ అయినా ఆఫర్స్ నాకొస్తాయ్

Update: 2016-08-24 07:30 GMT
బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్ ఇప్పుడు ప్రెగ్నెంట్. డిసెంబర్ లో తమకు బిడ్డ పుట్టబోతున్నట్లు సైఫ్-కరీనాలు ప్రకటించేశారు. అయితే.. ప్రెగ్నెన్సీ కారణంగా కరీనా కపూర్ కొన్ని సినిమాలను మిస్ చేసుకుందనే టాక్ ఉంది.

'వీరే ది వెడ్డింగ్' మూవీలో కరీనా కపూర్ ప్రధాన పాత్ర చేయాల్సి ఉండగా.. అక్టోబర్ లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. డిసెంబర్ లో డెలివరీ కావాల్సినపుడు.. రెండు నెలల ముందు షూటింగ్ సాధ్యం కాదంటూ.. కరీనా తప్పుకుందనే న్యూస్ వచ్చింది. హీరోయిన్ సోనమ్ కపూర్ లు ఈ వార్తలను ఖండిస్తూ.. తన సోదరి రియా కపూర్ తీస్తున్న ఈమూవీలో కరీనా నటిస్తుందని తేల్చేసింది. మరోవైపు గోల్ మాల్4లో కరీనా యాక్ట్ చేయడం కష్టమంటూ రోహిత్ శెట్టి వ్యాఖ్యలు కూడా మంట పుట్టించాయి. తర్వాత ఓ పాట చేయాల్సి ఉందని బుకాయించినా.. అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది.

తను చేయబోయే సినిమాలపై ఇన్నేసి వార్తలు వస్తుండడంతో.. కరీనా కపూర్ స్పందించింది. 'నేను గర్భవతిని అయినా.. నాతో సినిమాలు తీయాలని అనుకునేవాళ్లు నా దగ్గరకు వస్తారు. ఆఫర్స్ కూడా వస్తాయి. నేను ఓ వర్కింగ్ ఉమన్ ని. పుట్టక ముందే యాక్టింగ్ నేర్చుకున్న నేను 80ఏళ్లు వచ్చే వరకూ నటిస్తూనే ఉంటా' అంటా గాట్టిగా చెప్పేసింది.
Tags:    

Similar News