అధికారులకు చుక్కలు: పాజిటివ్ వేళ.. భర్త ఎక్కడో చెప్పని కరీనా?

Update: 2021-12-15 12:30 GMT
కరోనా వేళ.. అప్రమత్తతకు మించింది లేదు. ఆ విషయం సాదాసీదా వారికి సైతం తెలిసిన వేళలో.. సెలబ్రిటీలకు.. అందునా సినీ ప్రముఖులకు తెలీకుండా ఉంటుందా? మరేం అయ్యిందో కానీ.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహార్ ఇంటికి ఈ నెల 8న కరీనా కపూర్ వెళ్లారు. అక్కడ ఏర్పాటుచేసిన పార్టీలో పాల్గొన్నారు.

తాజాగా ఆమె కరోనా బారిన పడ్డారు. అంతేకాదు.. ఈ పార్టీకి హాజరైన వారిలో పలువురు పాజిటివ్ అయినట్లుగా తెలీటంలో ముంబయి కార్పొరేషన్ అధికారులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. వెంటనే.. కరీనా కపూర్ నివాసాన్ని సీజ్ చేయటమే కాదు.. అక్కడున్న వారందరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

వారి కాంటాక్ట్ ట్రేసింగ్ గురించి ఆరా తీస్తున్నారు. పార్టీలో పాల్గొన్న వేళ.. ఆ తర్వాత చాలామందిని కరీనా కలిసిన నేపథ్యంలో.. ఇప్పుడు వారి ఆరా తీయటం తలనొప్పిగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కరీనా భర్త కమ్ ప్రముఖ సినీ హీరో సైఫ్ అలీఖాన్ ఎక్కడ? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అయితే.. బీఎంసీ అధికారులకు.. తన భర్త ఎక్కడ ఉన్నాడన్న విషయాన్ని కరీనా కపూర్ చెప్పేందుకు ఇష్టపడకపోవటం చర్చనీయాంశంగా మారింది. తమ విచారణకు కరీనా కుటుంబం ఏ మాత్రం సహకరించటం లేదని చెబుతున్నారు.

ఎన్నిసార్లు అడిగినా.. సైఫ్ అలీ ఖాన్ ఎక్కడ ఉన్నాడన్న విషయాన్ని చెప్పట్లేదని.. ఎంతో ప్రయత్నం తర్వాత ఆయన ముంబయిలో లేరని.. వారం క్రితం బయటకు వెళ్లినట్లుగా చెబుతున్నారన్నారు. కరీనా కపూర్ పాజిటివ్ అయిన నేపథ్యంలో.. కరణ్ జోహార్ నివాసంలో ఇచ్చిన పార్టీకి హాజరైన వారి జాబితాను సిద్ధం చేసి.. వారికి పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. కరీనాకు పాజిటివ్ గా తేలిన తర్వాత.. సమాచారం అందుకున్న బీఎంసీ అధికారులు కరీనా నివసిస్తున్న అపార్ట్ మెంట్ కు వెళ్లారు. అక్కడి వారికి పరీక్షల్ని నిర్వహించారు.

ఆ సమయంలో కరీనా తమకు సహకరించటం లేదని అధికారులు చెబుతున్నారు. సైఫ్ కాంటాక్ట్ ట్రేసింగ్ తో పాటు.. కరీనా జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్ని కూడా నిర్వహిస్తున్నారు. ఈ అంశం మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో.. కరీనా పీఆర్ బ్యాచ్ సీన్లోకి వచ్చింది. డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నాలు షురూ చేశారు. కరీనా పాల్గొన్న పార్టీ.. మీడియాలో వస్తున్నంత పెద్దది కాదని.. చిన్నదని చెప్పిన వారు.. కరీనా ఎప్పుడూ బాధ్యతగా వ్యవహరిస్తారని.. అధికారులకు సహకరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇన్ని ముచ్చట్లు చెప్పారే కానీ.. కరీనా భర్త సైఫ్ ఎక్కడున్నారన్న విషయాన్ని సైతం వెల్లడించకపోవటం గమనార్హం.


Tags:    

Similar News