సీనియర్ భామ టబు మళ్లీ బాలీవుడ్ లో యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే. లేటు వయసులోనూ ఘాటుగా నటిస్తూ ఆకట్టకుంటుంది. ఇటీవలే 'భూల్ భులైయ్యా-2' తో ప్రేక్షకుల్ని అలరించింది. అంతకు ముందు 'అలవైకుంఠ పురంతో 'టాలీవుడ్ లోనూ కం బ్యాక్ అయింది. అలా అమ్మడు రెండు భాషల్లోనూ పున ప్రారంభం అదరగొట్టింది.
ప్రస్తుతం ఈ సినీయర్ భామ చేతిలో హిందీ నుంచి మూడు నాలుగు ఛాన్సులున్నాయి. మరి ఈ సీనియర్ నటి ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ తో తెరను పంచుకోవడానికి రెడీ అవుతుందా? అంటే అవుననే వినిపిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ లేడీ ఓరియేంటెడ్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాత రియా కపూర్ ఇద్దర్నీ ఒకేతాటిపైకి తీసుకొచ్చి మహిళా నేపథ్యంతో చిత్రం చేస్తున్నారు.
ఇటీవలే ఇద్దరికీ కథ వినిపించి ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇద్దరు మహిళల ప్రయాణం నేపథ్యంలో సాగుతుందిట. రెండు ప్రధాన కథలుంటాయి. రెండు పాత్రలు నువ్వా? నేనా? అన్న తీరున తెరపై పోటా పోటీగా కనిపిస్తాయని సమాచారం.
ఇద్దరు ఒకరికొకరు ఎలా పరిచయం అయ్యారు? తమకెదురైన సమస్యల్ని ఎలా పరిష్కరించుకున్నారు? ఒకరికొకరు సహాయం చేసుకున్నారా? లేక పోటా పోటీగా కత్తులు దూసారా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే అంటున్నారు.
దర్శకుడు తదితర వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. ఇలా ఇద్దరు భామలు తెరను పంచుకోవడం అభిమానుల్లో ఆసక్తి కరంగా మారింది. ఇంత వరకూ వీరిద్దరు కలిసి నటించింది లేదు. తొలిసారి నటిస్తుండటంతో? అభిమానుల్లో ఎగ్జైట్ మెంట్ కనిపిస్తుంది.
ఇక కరీనా ఇటీవలే 'లాల్ సింగ్ చడ్డా'లో నటించింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవడంలో విఫలమైంది. కరీనా గర్భం దాల్చక ముందు చేసిన సినిమా ఇది. ఆ తర్వాత కొత్త సినిమాలకు కమిట్ కాలేదు. కొన్ని నెలలుగా ఇంట్లోనే ఉంటుంది. కమర్శియల్స్ యాడ్స్ తప్ప సినిమాలు చేసింది లేదు. ఈ నేపథ్యంలో బెబో సెట్స్ కి వెళ్లడంపైనా ఆసక్తి నెలకొంది.