జబర్దస్త్.. ఖతర్నాక్ కామెడీ షో అంటూ టెలివిజన్ లో సంచలనాలు సృష్టించిన ప్రోగ్రాం ఇది. తెలుగు ప్రేక్షకులను ఈ రేంజ్ లో టీవీకి కట్టుబడిపోయేట్టు చేయచ్చని ప్రూవ్ చేసిన జబర్దస్త్.. ఇప్పుడు బూతుల మయం అని చెప్పడానికి సందేహించాల్సిన పని లేదు. కార్యక్రమంతో పాటు ఇందులో స్కిట్స్ వేసే ఆర్టిస్టులకు కూడా బోలెడంత డిమాండ్ వచ్చేసింది. బయట చాలానే ప్రోగ్రాములు ఇచ్చేస్తూ.. తెగ బిజీబిజీగా గడిపేస్తున్నారు కూడా.
తాజాగా కరీంనగర్ త్యాగరాజ స్వామి వేడుక ముగింపు ఉత్సవం కోసం జబర్దస్త్ టీంతో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో చిట్టి బాబు - వెంకి - జూనియర్ రేలంగిలు పాల్గొనగా.. ఈ షోకి ఆడియన్స్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రోగ్రామ్ ప్రారంభించిన మొదట్లో బాగానే ఉన్నా... రాన్రానూ బూతుల డోస్ ఎక్కువైపోయింది. దీంతో పవిత్రమైన దేవాలయంలో ఇలాంటి ఛండాలమైన ప్రోగ్రామ్ ఇస్తారా అంటూ తిట్టిపోశారు ఆడియన్స్.
రాజరాజేశ్వరస్వామి సన్నిధిలో ఇలాంటి అడల్ట్ కంటెంట్ ను ప్రదర్శించాలన్న జబర్దస్త్ టీం ఆలోచనకు ముందు ఆశ్చర్యపోవాలి. ఈ స్థాయిలో పేరు తెచ్చుకున్నాక అయినా.. ఎక్కడ ఎలాంటి ప్రదర్శనలు ఇవ్వాలో తెలీడం లేదు అనుకోవాలో.. లేక జోకులంటే బూతులే అని ఈ జబర్దస్త్ ఆర్టిస్టులు ఫిక్స్ అయిపోయారో అర్ధం కాని విషయం.
Full View