పెట్స్ కోసం జాన్వీ విచారం ఏడ్చేసినంతగా!
ఈ క్రమంలోనే వాటితో కలిసి దిగిన ఫోటోలను, స్టోరీలను పంచుకుంటుంది. టూర్ కి వెళ్తుందంటే సంతోషంగా కంటే బాధే ఎక్కువగా ఉంటుంది.
జాన్వీ కపూర్ కి తన పెట్స్ అంటే ఎంతో ప్రాణం. అమెరికన్ అకిటా, హస్కీ అనే రెండు కుక్కల్ని పెంచుకుంటుంది. ఖాళీ దొరికినప్పుడల్లా వాటితోనే ఆడుకుంటుంది. అంతే కాదు వాటితో గడిపిన క్షణాల్ని ఫోటోల్లో, వీడియోల్లో బంధిస్తూ సోషల్ మీడియాలో పంచుకుంటుంది. అయితే తానెంతో ఇష్టపడే వీటిని వదిలిపెట్టి రోజుల తరబడి వెకేషన్ కు వెళ్లాలన్నా...షూటింగ్ ల్లో పాల్గొనాలన్నా మనసొప్పదంటోంది.
ఈ క్రమంలోనే వాటితో కలిసి దిగిన ఫోటోలను, స్టోరీలను పంచుకుంటుంది. టూర్ కి వెళ్తుందంటే సంతోషంగా కంటే బాధే ఎక్కువగా ఉంటుంది. ఆ ఆలోచనలు, అందోళన, ఒత్తిడికి గురవుతానని పలు సందర్భాల్లో చెప్పింది. తాజాగా అమ్మడు షూటింగ్ స్పాట్ నుంచి తన కుక్కలతో వీడియో కాల్ ని ఇలా రివీల్ చేసింది. `అవుట్ డోర్ షూట్ లో కష్టతరమైన భాగం` ఇది అంటూ ఓ పోస్ట్ తో పాటు కుక్కలతో ఉన్న ఫోటోలను పంచుకుంది. `గిల్డీ డాగ్ మామ్` అనే మరోపోస్ట్ చూడొచ్చు.
ఇక్కడ జాన్వీకపూర్ ముఖాన్ని చూడొచ్చు. తనకు ఇష్టమైన పెట్స్ కి దూరంగా ఉండటంతో జాన్వీ ఇలా విచారం వ్యక్తం చేస్తుంది. కుక్కలపై ప్రేమతో ఇలా దిగులు చెందుతుంది. పెదాలు బయటకు వచ్చేసాయి. కళ్లు నీర సించాయి. ముఖంలో కళ తప్పది. ఇక్కడ కుక్కలు కూడా అంతే విచారం చెందుతున్నాయి. దీనగా జాన్వీ ముఖం వైపు చూస్తున్నాయి. రెండు కుక్కలు పక్క పక్కనే ఉన్నాయి.
ఇలా జాన్వీ ఇంటికి తిరిగి వచ్చే వరకూ ఆ రెండు కుక్కలు చూడక తప్పదు. మనిషికి-కుక్కకి ఉన్న అవినాభావ సంబంధం అంత గొప్పది. అన్ని జంతువులు కంటే కుక్కకి విశ్వసం ఎక్కువ. ఈరోజుల్లో కుక్కకి ప్రాధాన్యత పెరు గుతుంది. అవి సైతం మనుషుల్లో భాగమైపోతున్నాయి. చాలా మంది సెలబ్రిటీలకు ఇలా కుక్కల్ని పెంచడం అన్నది ఓ హాబీ లాంటింది. స్వేదేశీ కుక్కల్ని పెద్దగా పెంచరు గానీ, విదేశీ బ్రీడ్లను ఎక్కువగా పెంచుతుంటారు.