దిల్లీ రాష్ట్రపతి భవన్ ముందు క్రేజీ కపుల్ సైక్లింగ్!
ఇందులో పరిణీతి చోప్రా, తన భర్త రాఘవ్ చద్దా ఢిల్లీలోని ఓ రహదారిపై ఎర్లీ మార్నింగ్ సైకిల్ తొక్కుతూ కనిపించారు.
స్నేహితురాలే భార్య అయితే ఆ సంసారంలో ఆనందం ఎలా ఉంటుందో ఈ జంటను చూస్తే చెప్పేయొచ్చు. తన స్నేహితురాలు, క్లాస్ మేట్ అయిన పరిణీతి చోప్రాను పెళ్లాడాడు ఆప్ నాయకుడు రాఘవ్ చద్దా. ఈ జంట అన్యోన్యత, ప్రేమాభిమానాలు ప్రతిదీ కపుల్ గోల్స్ ని సెట్ చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో లవ్‌బర్డ్స్ సైక్లింగ్‌ను ఎంజాయ్ చేస్తున్న కపుల్ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
ఒక అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఇందులో పరిణీతి చోప్రా, తన భర్త రాఘవ్ చద్దా ఢిల్లీలోని ఓ రహదారిపై ఎర్లీ మార్నింగ్ సైకిల్ తొక్కుతూ కనిపించారు. వారు కార్త్వ్యాపత్ మార్గంలో సైకిల్ తొక్కుతుంటే.. నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ కనిపించింది. భర్తతో పోటీపడుతూ పారీ వేగంగా వెళుతున్న విధానం.. ఇద్దరూ మాట్లాడుకుంటూ సరదాగా గడిపిన సమయం.. ప్రతిదీ ఈ వీడియోలో ఆశ్చర్యపరుస్తున్నాయి.
పారి బ్లాక్ టాప్‌లో మ్యాచింగ్ జాగర్ ప్యాంట్ తెలుపు స్నీకర్లతో కనిపించగా, రాఘవ నల్లటి టీ-షర్టు ధరించి దానిపైన హాఫ్ స్లీవ్ జాకెట్‌తో మ్యాచింగ్ షార్ట్‌తో ఉన్నాడు. ఈ పోస్ట్ వేగంగా వైరల్ అయింది. నాకు ఇష్టమైన సైక్లింగ్ దునియా కి సబ్సే ఖుబ్సూరత్ జోడీ కిసీ కి నజర్ నా లగే. మరొక అభిమాని వ్వావ్.. అని వ్యాఖ్యానించగా, మూడవ అభిమాని వారిని 'నైస్ కపుల్' అని పొగిడేశాడు. మరొకరు 'ఉత్తమ జంట' అని అన్నారు. చాలా మంది అభిమానులు కామెంట్స్ విభాగంలో రెడ్-హార్ట్, హార్ట్-ఐ ఈమోజీలను షేర్ చేసారు.
సోమవారం నాడు పరిణీతి- రాఘవ్ చద్దా జంట మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన తల్లి రీనా చోప్రా నుండి అందుకున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుమతిని అందజేస్తూ ఈ అందమైన పోస్ట్‌ను షేర్ చేసారు. పరిణీతి చోప్రా - రాఘవ్ చద్దా సెప్టెంబర్ 23న ఉదయపూర్‌లో అంగరంగ వైభవంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. పెళ్లి తర్వాత నటనకు దూరమైంది పారీ.