ఫోటో స్టొరీ: మేడిన్ ముంబై బాంబ్

Update: 2019-09-28 11:02 GMT
బాలీవుడ్ లో ఉన్న ఎంతోమంది హాటు బ్యూటీలలో కరిష్మా శర్మ ఒకరు. ఈ పాతికేళ్ళ ముంబై భామ 'ఎంటీవీ వెబ్డ్'.. 'కామెడి సర్కస్' లాంటి చాలా టీవీ షోస్ లో పాల్గొంది. 'ప్యార్ కా పంచనామా 2' .. 'హోటల్ మిలన్' లాంటి హిందీ సినిమాల్లో నటించి బాలీవుడ్ నటి అనిపించుకుంది.  ఎఎల్టీ బాలాజీ వారి 'రాగిణి ఎంఎంఎస్: రిటర్న్స్' వెబ్ సీరీస్ తో హాటు బాంబు ఇమేజ్ ని రెట్టింపు చేసుకుంది.

ఈ భామకు టైం దొరికితే చాలు ఫోటో షూట్లు చేయడం.. ఆ ఫోటోలను ఇన్స్టా లో ఫాలోయర్లకోసం షేర్ చేయడం అనేది ముఖ్యమైన హాబీ.  ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ తాజాగా బికినీ ఫోటోలను తన ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోలలో ఒకదానికి  "నన్ను అర్థం చేసుకోండి.. నేను సాధారణ ప్రపంచాన్ని కాదు.  నాకంటూ పిచ్చి ఉంది. నేను మరో కోణంలో జీవిస్తాను. జీవంలేని వాటికి నా దగ్గర సమయం లేదు" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ఇదేదే గబ్బర్ సింగ్ ఫిలాసఫీ తరహాలో ఉంది.  నాకు కొంచెం తిక్క ఉంది.. బ్రెయిన్ లేనివారికి నేను టైం ఇవ్వనని చెప్తోంది.  అయితే నెటిజన్లకు బ్రెయిన్ తో పాటుగా కళాపోషణ కూడా ఉంటుంది కదా వారి కోసం బికినీ ఫోటోలను పోస్ట్ చేసిందేమో.

బ్లాక్ అండ్ వైట్ ఫోటో కావడంతో కళాత్మకంగా ఉంది. బికినీలో అందాలను వీలైనంతగా వడ్డించింది. అయినా ఇంత ఫిట్టుగా ఉండాలంటే ఎంత డైట్ మెయింటెయిన్ చెయ్యాలి.. రోజూ ఎంతసేపు కసరత్తులు చెయ్యాలి? అవన్నీ చేస్తోంది కాబట్టే ఇలా నెటిజన్లను కాల్చుకుతినే పోజులు ఇవ్వగలుగుతోంది.  ఈ ఫోటోలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. "మేడిన్ ముంబై బాంబ్".. "నీకు పిచ్చి ఉందో లేదో క్లానీ హాట్ నెస్ ఉంది".. "బెస్ట్ బికినీ బ్యూటీ" అంటూ కొందరు నెటిజన్లు తమ స్పందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ భామ చేతిలో సినిమాలేవీ లేవు కానీ రీసెంట్ గా హృతిక్ సినిమా 'సూపర్ 30' లో ఒక ఐటెం సాంగ్ కు స్టెప్పులేసింది.
Tags:    

Similar News