తమిళ స్టార్ హీరో కార్తీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఇటీవలే ఈయన నటించిన సుల్తాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో బ్యాక్ టు బ్యాక్ సినిమా లను బాక్సాఫీస్ వద్దకు తీసుకు వచ్చే ప్రయత్నాల్లో ఈ యంగ్ స్టార్ హీరో కార్తీ బిజీగా ఉన్నాడు.
ఎం ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న విరుమన్ సినిమా విడుదల తేదీ విషయంలో నిన్న మొన్నటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. సినిమా దసరా లేదా దీపావళికి విడుదల అయ్యే అవకాశం ఉందని అంతా భావించారు. కాని అనూహ్యంగా సినిమా ను ఆగస్టు 11న విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వస్తున్న వార్తలు కార్తీ అభిమానులకు సర్ ప్రైజింగ్ గా ఉన్నాయి.
ముందుగా అనుకున్న ప్రకారం ఆగస్టు 11న విక్రమ్ నటించిన కోబ్రా సినిమా విడుదల అవ్వాల్సి ఉంది. పాన్ ఇండియా సినిమా గా విడుదల అవ్వాల్సిన కోబ్రా సినిమా ను గ్రాఫిక్స్ వర్క్ కంప్లీట్ అవ్వలేదు అనే ఉద్దేశ్యంతో ఆగస్టు 31 కి వాయిదా వేయడం జరిగింది. దాంతో ఆ డేట్ ను కార్తీ వినియోగించుకునేందుకు గాను రెడీ అయ్యాడు.
విక్రమ్ కోబ్రా సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆ తేదీని చాలా మంది ఫిల్మ్ మేకర్స్ అవైడ్ చేశారు. ఇప్పుడు ఆ తేదీకి రావడానికి ఏ ఒక్కరు సిద్ధం గా లేరు. కేవలం కార్తీ మాత్రమే తన విరుమన్ సినిమా తో రెడీగా ఉన్నాడట. ఇప్పటికే షూటింగ్ పూర్తి అవ్వడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
విరుమన్ సినిమా లో కార్తీ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. గతంలో సూపర్ హిట్ అయిన ఒక సినిమా లోని పాత్ర లుక్ లాగే ఈ సినిమా లో కూడా కార్తీ లుక్ ఉండటం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ సినిమా లో కార్తీకి జోడీగా అదితి శంకర్ నటిస్తోంది. ఇంకా ఈ సినిమా లో ప్రకాష్ రాజ్.. రాజ్ కిరణ్.. శరణ్య పొన్వనన్.. సూరి తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.