ఫ్యామిలీ ఫ్యామిలీ ఓటీటీకే అంకిత‌మ‌య్యారుగా..

Update: 2020-10-22 07:50 GMT
ఓటీటీ రిలీజ్ అంటే థియేట‌ర్ య‌జ‌మానులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటు హైద‌రాబాద్ ప‌రిశ్ర‌మ‌లో విప్ల‌వాన్ని అణ‌చివేసినా కానీ.. అటు కోలీవుడ్ లో ప‌ప్పులుడ‌క‌డం లేదు. ఎగ్జిబిట‌ర్లు అంతా ఏక‌మై స్టార్ హీరోల్నే ఆటాడేస్తున్నారు. లాక్ డౌన్ ప‌ర్య‌వ‌సాన‌మిది. అయితే అన్నిటినీ ఎదురించి నిల‌బ‌డ్డాడు స్టార్ హీరో సూర్య‌. అత‌డు త‌న సినిమా ఆకాశం నీ హ‌ద్దురా(సూరరై పొట్రూ) ని ఓటీటీకి విక్ర‌యించడ‌మే గాక‌.. త‌దుప‌రి చిత్రాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడని స‌మాచారం ఉంది.

ఇప్పుడు అన్నబాట‌లోనే వెళుతున్నాడు త‌మ్ముడు కూడా. సూర్య సోద‌రుడు కార్తీ కూడా ఓటీటీ బాట‌లోనే వెళ్లేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది. సూరియా తరువాత.. కార్తీ చిత్రం ‘సుల్తాన్’  డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ ‌ద‌క్కించుకుంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రంతోనే రష్మిక మంద‌న‌ తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశిస్తోంది.

అయితే అమెజాన్ ‌కు హక్కులను విక్రయించినా.. ‘సుల్తాన్’ ప్రత్యక్ష OTT విడుదలకు వెళ్ళదన్న‌దే ఇక్క‌డ ట్విస్టు. మహమ్మారికి ముందు మాదిరిగానే ఈ చిత్రం థియేట్రికల్ విడుదలకు సంసిద్ధ‌మవుతోంద‌ట‌. థియేట్రిక‌ల్ రిలీజ్ అయిన‌ ఒక నెల తర్వాత మాత్రమే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతుంది.  ఈ రెండు సినిమాలకు ముందు జ్యోతిక న‌టించిన‌ ‘పొన్మగల్ వంధల్’ కూడా నేరుగా అమెజాన్ లో విడుదలైంది. మొత్తానికి అమెజాన్ ప్రైమ్ కి సూర్య కుటుంబం అంకిత‌మైంది అంటూ ఎగ్జిబిట‌ర్ సెక్టార్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఎగ్జిబిట‌ర్లు వ్య‌తిరేకిస్తున్నా అవేవీ ప‌ట్టించుకోకుండా సినిమా న‌ష్ట‌పోకుండా జాగ్ర‌త్త ప‌డుతున్న సూర్య ప్ర‌తిదీ తెలివిగా ప్లాన్ చేస్తున్నార‌న్న చ‌ర్చా అభిమానుల్లో సాగుతోంది.
Tags:    

Similar News