యాక్షన్ థ్రిల్లర్ 'ఖైదీ' సీక్వెల్ పై క్రేజీ అప్డేట్..!

Update: 2021-05-27 12:30 GMT
తమిళ స్టార్ హీరో కార్తీ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. కార్తీ నటించే సినిమాలన్నీ తెలుగులోకి డబ్ వెర్షన్ రిలీజ్ అవుతుంటాయి. కార్తీ ఫస్ట్ మూవీ యుగానికి ఒక్కడు నుండి ఇటీవలి సుల్తాన్ వరకు అన్నీ తెలుగులో విడుదల అవుతూనే ఉన్నాయి. 2019లో ఖైదీ సినిమాతో వందకోట్ల క్లబ్ లో చేరాడు కార్తీ. ఆ యాక్షన్ థ్రిల్లర్ ను యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఓ ల్యాండ్ మార్క్ మూవీలా రూపొందించాడు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్ఆర్ ప్రభు - శేఖర్ బాబు సంయుక్తంగా నిర్మించారు. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా విడుదలైన ఈ మూవీ 2019 దీపావళి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయం దక్కించుకుంది. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. ఇక వసూళ్ళ పరంగా ఖైదీ రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

త్వరలోనే ఖైదీ మూవీ బాలీవుడ్ లో కూడా రీమేక్ కాబోతుంది. అజ‌య్ దేవ‌గ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించనున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని కార్తీ గతంలోనే ప్రకటించిన విషయం విదితమే. అయితే ఇటీవలే డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. ఇళయదళపతి విజయ్ హీరోగా మాస్టర్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. మరోవైపు కార్తీ కూడా సుల్తాన్ సినిమా హిట్ ఖాతాలో వేసుకున్నాడు. అయితే తాజాగా ఈ మూవీ ప్రొడ్యూసర్ ఎస్ఆర్ ప్రభు సినిమా సీక్వెల్ పై స్పందించాడు. ఖైదీ సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం దర్శకుడు లోకేష్ సూపర్‌స్టార్ కమల్ హాసన్ తో విక్రమ్ అనే థ్రిల్లర్ చిత్రం రూపొందిస్తున్నాడు.

ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఆ తర్వాత మళ్లీ లోకేష్ దళపతి విజయ్ తో మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడని టాక్. మరోవైపు హీరో కార్తీ మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో సర్దార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ హీరో దర్శకుడు ఇద్దరూ కూడా ఫ్రీ అవ్వాలంటే ఇంకా ఏడాది లేదా ఎక్కువే పట్టొచ్చు. కాబట్టి వారెప్పుడు రెడీ అయితే అప్పుడే ఖైదీ సీక్వెల్ పట్టాలెక్కుతుంది. కానీ సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని మాత్రం క్లారిటీ ఇచ్చేసాడు నిర్మాత. మరి వీరిద్దరూ ప్రస్తుతం సినిమాలు కంప్లీట్ చేసే వచ్చే ఏడాది కావచ్చు. చూడాలి మరి నెక్స్ట్ ఇయర్ ఖైదీ సీక్వెల్ ప్రారంభం అవుతుందేమో. ఖైదీలో హీరోయిన్ లేకుండానే సినిమా నడిపించేసాడు డైరెక్టర్. గతంలో హీరోకి భార్య ఉంటుందని తెలిపాడు. అందుకే ఈసారి హీరోయిన్ ఉంటుంది. చూడాలి మరి హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో!
Tags:    

Similar News