మన సినిమాల్లో ఎక్కువగా కమర్షియల్ ఫార్మాట్లో తెరకెక్కేవే. హీరో.. హీరోయిన్.. విలన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు లేకపోయినా అది రెగ్యులర్ సినిమా కిందకు రాదు. అందులోనూ విలన్ లేకుండా లవ్ స్టొరీలు వస్తుంటాయిగానీ హీరో.. హీరోయిన్లలో ఒకరు లేకుండా అసలు మనం సినిమాను ఊహించలేం. రీసెంట్ గా తమిళ హీరో కార్తి అలాంటి సినిమాకే ఒప్పుకున్నాడట.
ఇదొక యాక్షన్ థ్రిల్లర్ అని.. ఈ సినిమాకు హీరోయిన్ పాత్ర అవసరం లేదని సమాచారం. 'మానగరం' లాంటి విమర్శకులచే ప్రశంసలు అందుకున్న చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తాడట. హీరోయిన్ లేదంటే.. లవ్వు గివ్వు లేదు. పెళ్ళి గిళ్ళి జాన్తానై. హీరో ఫుల్ గా యాక్షన్ మోడ్ లో ఉండడమే. కార్తి ఈమధ్యే పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో 'చినబాబు' ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేశాడు. ఇక త్వరలో రిలీజ్ కానున్న సినిమా 'దేవ్' ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్. దేవ్ తర్వాత లోకేష్ కనగరాజ్ తో కార్తి చేయనున్న సినిమా ఒక ప్రయోగం లాంటిదే.
మరి హీరోయిన్ లేని ఇలాంటి సినిమాతో ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పిస్తాడో వేచి చూడాలి. ఈ సినిమాకు 'విక్రమ్ వేద' ఫేమ్ సామ్ సిఎస్ సంగీతం అందిస్తాడు. ఈ సినిమాను ఎస్ ఆర్ ప్రభు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.