బాహుబలితో కంపేర్ చేయకండి ప్లీజ్

Update: 2016-10-26 04:05 GMT
''దయచేసి మా సినిమాను బాహుబలితో కంపేర్ చేయకండి. అసలు మేం షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడు బాహుబలి రిలీజ్ అయ్యింది. ఆ సినిమాను చూసిన తరువాత మా షూటింగ్ ఏకంగా రెండు నెలలు ఆపేశాం. ఏం చేయాలి.. ఎలా చేస్తే విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ బాగా వస్తుంది అంటూ అంచనాలు వేసుకుని.. అప్పుడు షూటింగ్ మొదలెట్టాం. మేం బాగానే తీశాం అనుకుంటున్నాం కాని.. బాహుబలి రేంజులో మాత్రం ఊహించకండి'' అంటూ సంచలనాత్మకైన స్టేట్మెంట్ ఇచ్చాడు హీరో కార్తి. మనోడు నటించిన ''కాష్మోరా'' సినిమా వచ్చే శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా.. మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా చెప్పుకొచ్చాడు.

నిజానికి బాహబలి సినిమా రాకతో అసలు ఇండియాలో విజువల్ ఎఫెక్ట్స్ లో సినిమాలు చేయాలనుకునే వారి మైండ్ సెట్ టోటల్ గా మారిపోయింది. ఆ మధ్యన కింగ్ నాగార్జున కూడా.. బాహుబలి సినిమా వచ్చిన తరువాత చీప్ గ్రేడ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేవి అసలు ప్రజలు ఆమోదించే మూడ్ లో లేరని స్వయంగా తెలిపారు. అలాగే ఇప్పుడు కార్తి కూడా అదే చెబుతున్నాడు. అంటే బాహుబలి ఆ రేంజ్ స్టాండర్డ్స్ సెట్ చేసిందనమాట. ఇకపోతే కాష్మోరా సినిమాలో ఏకంగా 45 నిమిషాల ఫ్లాష్‌ బ్యాక్ ఎపిసోడ్ ఉంది. 500 సంవత్సరాల క్రితం జరిగిన ఒక కథ అంటూ ఒక రాజులు కథను చూపిస్తున్నారు. ఆ ఘట్టం కోసం ఏకంగా 19 సెట్స్ కూడా వేశారు. అందుకే కార్తి బాగా టెన్షన్ పడుతున్నట్లున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News