'దేవ్' తంబీ ఓవ‌రాక్ష‌నేమిటో?

Update: 2019-02-13 07:04 GMT
ఈ వాలెంటైన్స్ డే కానుక‌గా రెండు అనువాద చిత్రాలు రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్- రోష‌న్ జంట‌గా న‌టించిన‌ `ల‌వ‌ర్స్ డే` చిత్రంతో పాటు కార్తీ- ర‌కుల్ జంట‌గా న‌టించిన `దేవ్` బాక్సాఫీస్ వ‌ద్ద పోటీకి దిగుతున్నాయి. తెలుగు స్ట్రెయిట్ సినిమాల రిలీజ్ లు లేక‌పోవ‌డం ఈ రెండిటికి ప్ల‌స్ అనే చెప్పాలి. అయితే ఆ రెండిటిలో ఏ సినిమా స‌త్తా ఎంత‌? అన్న‌ది తేలాలంటే కాస్త‌ ఆగాల్సిందే.

అనువాద చిత్రాలే అయినా `ల‌వ‌ర్స్ డే` కి ఉన్నంత ప్ర‌మోష‌న్ `దేవ్` కి లేద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. కార్తీ లాంటి పెద్ద హీరో న‌టించిన సినిమా అయినా ప్ర‌చారం ప‌రంగా కాస్త వెన‌క‌బ‌డింద‌నేది ఫిలింన‌గ‌ర్ లో ముచ్చ‌ట‌. అయితే హీరో కార్తీ పూర్తిగా త‌మిళ వెర్ష‌న్ ప్ర‌మోష‌న్ పైనే దృష్టి సారించి తెలుగు వెర్ష‌న్ ని లైట్ తీస్కున్న‌ట్టే క‌నిపిస్తోంది. తాజాగా ఓ ప్ర‌మోష‌న‌ల్ వీడియోని క్రిటిక్ ర‌మేష్ బాలా సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఫ‌న్ - సెటైర్ ఆక‌ట్టుకుంది.

ప్ర‌మోష‌న‌ల్ వీడియో కాస్త క్రియేటివ్ గానే ఉంది. ఇందులో కార్తీ - ర‌కుల్ తో పాటు ఇత‌ర చిత్ర‌యూనిట్ క‌నిపించారు. ట్రావెలింగ్ - అడ్వెంచ‌ర్ క‌థాంశం ఇద‌ని చెబుతూ ఓ స్కిట్ - అలాగే ల‌వ్ స్టోరి కూడా ఉంద‌ని చెబుతూ ర‌కుల్ తో ఓ స్కిట్.. ఇమాజినేష‌న్ మోడ్ లో చూపించ‌డం ఆక‌ట్టుకుంది. ల‌వ్ కంటే ఫ్రెండ్షిప్ ఇంపార్టెంటా? అంటూ ర‌కుల్ అల‌క బూన‌డం ఆస‌క్తి రేకెత్తిస్తుంది. దీంతో పాటు చివ‌రిలో పైర‌సీలో రిలీజ్ చేసేస్తాం రెడీనా?! అంటూ కార్తీకి వార్నింగ్ ఇచ్చే ట్రీట్ మ‌రో ట్విస్టు. మొత్తానికి వీడియో లో ఫ‌న్ ఆక‌ట్టుకుంది. అయితే అంత ఫ‌న్ సినిమాలో ఉంటుందా?  అన్న‌ది తెర‌పైనే చూడాలి. ఫ్యామిలీ - యంగ్ స్ట‌ర్స్ అంద‌రికీ న‌చ్చే సినిమా ఇది .. ఫిబ్ర‌వ‌రి 14న మా సినిమాని థియేట‌ర్ లో వీక్షించండి అంటూ కార్తీ ప్ర‌చారం చేశారు. ఫిబ్ర‌వ‌రి 14న నెట్ లో హెచ్ డి ప్రింట్ రిలీజ్ చేస్తాం! అంటూ సెటైరిక‌ల్ గా చూపించిన స్కిట్ ఫ‌న్నీగా ఉంది. అయితే హెల్మెట్ ప‌ట్టుకుని బైక్ రేస‌ర్ గా చేసిన స్కిట్ లో తంబీ ఓవ‌రాక్ష‌న్ టూమ‌చ్ అప్పా! అంటున్నారు మ‌న క్రిటిక్స్. ఇక బిజినెస్ ప‌రంగా ప‌రిశీలిస్తే దేవ్ చిత్రానికి తెలుగు రైట్స్ స‌హా క‌ర్నాట‌క‌ - కేర‌ళ హ‌క్కుల రూపంలో 7.5కోట్ల మేర బిజినెస్ సాగింద‌ని తెలుస్తోంది. స‌న్ నెట్ వ‌ర్క్ డిజిట‌ల్ - శాటిలైట్ రైట్స్ ని ఛేజిక్కించుకుంది.


Full View

Tags:    

Similar News