నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన కార్తికేయ సినిమా ఫ్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ అందుకునే ప్రయత్నం చేస్తుంది. అసలు ఈ సినిమా తెలుగులో సక్సెస్ అవుతుందా అనే అనుమానాలు మొదట్లో చాలానే వచ్చాయి. చాలాసార్లు వాయిదాలు వేయడంతో అసలు విడుదల అవుతుందా లేదా నేను కామెంట్స్ కూడా ఎక్కువగానే వినిపించాయి. ఏదేమైనాప్పటికీ కూడా మొత్తంగా కార్తికేయ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఒక వైబ్రేషన్ అయితే క్రియేట్ చేస్తోంది.
అక్కడ మొదటి రోజు నుంచి కూడా సినిమాకు రోజు రోజుకి డిమాండ్ ఎక్కువ అవుతూ ఉండడం విశేషం. ముఖ్యంగా షోల సంఖ్య కూడా ఊహించని రేంజ్ కు పెరుగుతోంది. నార్త్ ఆడియన్స్ శ్రీకృష్ణ పరమాత్మ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా అంటూ ఈ సినిమాను ఎగబడి చూసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక మొదటి రోజు ఏదో నార్మల్గా 58 షోలు ప్రదర్శించగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక రెండవ రోజు నుంచి అసలు సంఖ్య పెరుగుతూ వచ్చింది.
రెండవ రోజు 181 షోలకు వచ్చిన కార్తికేయ 2 ఆ తర్వాత ఏకంగా 3వ రోజు 711 షోలతో హడావిడి మొదలుపెట్టింది. ఇక నాలుగవ రోజు అయితే 1228 షోల వరకు రాగా ఇప్పుడు ఐదవ రోజుకు 1575లోకి రావడం మరొక ఆశ్చర్యకరమైన విషయం.
ఇక ఈ సంఖ్య అయితే ఇప్పట్లో ఆగేలా లేదు అని తెలుస్తోంది. ఎందుకంటే ఆగస్టు 18, 19 తేదీలలో శ్రీకృష్ణ జన్మాష్టమి హడావిడి ఉంటుంది. కాబట్టి ఈ రెండు రోజులు కూడా సినిమాకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది.
దీంతో సెంటిమెంట్ తో సినిమాను చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈసారి ఏకంగా 2500 పైగా షోలు ప్రదర్శించడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఆ సంఖ్య 3000 వరకు కూడా వెళ్లవచ్చు అని తెలుస్తోంది.
ఇటీవల కాలంలో ఏ సినిమాకు కూడా ఈ తరహా రేంజ్ లో అయితే థియేటర్ల సంఖ్య పెరగలేదు. ఒక విధంగా ఇది బాహుబలి రేంజ్ లో హిందీలో థియేటర్ల సంఖ్యను పెంచుకుంటున్నట్లు అనిపిస్తోంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.