కంటికి కనిపించని ఒక మహమ్మారి సూక్ష్మజీవి ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ప్రతీ దేశం మీద పడింది.. ప్రతీ రంగం మీద పడింది.. మన దేశంలో ప్రతీ రాష్ట్రం మీదా పడింది.. జీవించియున్న ప్రతీ మనిషి మీదా పడింది. ఇక సినిమా రంగం విషయానికొస్తే దీని దెబ్బ ఇంకా ఎక్కవగా ఉందని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుండటంతో సినిమా మీద ఆధారపడి జీవిస్తున్న ఎన్నో కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. అంతేకాకుండా సినిమాలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకోవాలని చూస్తున్న యువ హీరోల మీద కరోనా ఎఫెక్ట్ పడిందని చెప్పవచ్చు. రోజురోజుకు కరోనా మరింత తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించడంతో ఆగిపోయిన షూటింగ్‌లు ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతాయో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కొంతమంది యువ హీరోల కెరీర్ ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు ఏర్పడ్డాయి. వాళ్లలో ముఖ్యంగా నవతరం కథానాయకుడు కార్తికేయ కెరీర్ పై కరోనా మహమ్మారి పెద్ద దెబ్బ కొట్టిందట.
ఇంతకీ కథ ఏంటంటే.. కార్తికేయ సొంత ప్రొడక్షన్ లో 'ప్రేమతో మీ కార్తీక్' అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. కానీ ఈ సినిమా ఉన్నట్లు కూడా చాలా మందికి తెలియదు. ఆ తర్వాత Rx100, గుణ 369, 90 ML చిత్రాలలో నటించాడు. పాపం.. మనోడికి కెరీర్ లో 'Rx100' తప్పితే మరో హిట్ సినిమా లేదు. ఆ సినిమా కూడా బూతు సినిమా అనే స్టాంపింగ్ తో హిట్ కొట్టిందని ఇప్పటికీ అందరూ కామెంట్స్ చేస్తుంటారు. దీంతో మనోడు మాస్ ఇమేజ్ అంటూ ఆ తరువాత ట్రై చేసిన సినిమాలు అన్నీ వరుసపెట్టి ఫ్లాప్స్ అయిన విషయం తెలిసిందే. ఈ మధ్యే సొంత బ్యానర్ లో ఎన్నో ఆశలు పెట్టుకొని తీసిన 90 ఎమ్.ఎల్ కూడా దారుణంగా ఫ్లాప్ అయింది. మనోడి అదృష్టం బాగుండడంతో ఒక పెద్ద ప్రొడక్షన్ లో నటించే అవకాశం వచ్చింది. ఫ్లాప్స్ వచ్చినా లక్కీగా లాటరీ తగిలినట్లుగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో 'చావు కబురు చల్లగా' అనే సినిమా ఓకే అవ్వడం, ఆ వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం జరిగిపోయాయి. అయితే ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. 90 ఎమ్.ఎల్ షూటింగ్ టైమ్ లోనే కార్తీకేయ మరో సినిమాకి సైన్ చేశాడట. కానీ ఇంతలో గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద ప్రొడక్షన్ లో సినిమా రావడంతో ఫస్ట్ ఈ సినిమాను ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసి, ఆ వెంటనే అంతకు ముందు ఒకే చెప్పిన సినిమా పనులు స్టార్ట్ చేద్దామని కార్తీకేయ అండ్ టీమ్ ప్లాన్ చేశారట.
కానీ కరోనా కారణంగా వీళ్ళ ప్లాన్ మొత్తం చెడిపోయింది. వెరసి ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేసాక గీతా ఆర్ట్స్ వాళ్లు కార్తీకేయ సినిమాకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇస్తారో చెప్పలేని పరిస్థితి. ఒకవేళ ఇచ్చినా అది ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి.. ఎప్పుడు రిలీజ్ అవ్వాలి. మరి ముందు ఒప్పుకున్న సినిమా వాళ్లు కార్తీకేయకి అంత టైమ్ ఇస్తారా... ఇలాంటి నేపథ్యంలో ఈ యంగ్ హీరో సతమతమవుతున్నాడట. దీంతో తెలిసిన వాళ్ళు మన హీరోకి ఎంత కష్టమొచ్చి పడిందిరా.. ఆ మహమ్మారి కరోనా వచ్చి మనవాడికి కెరీర్ లేకుండా చేసేలా ఉందని బాధపడుతున్నారట. మరి రానున్న రోజుల్లో ఈ హీరో కెరీర్లో ఇంకెన్ని పరిణామాలు జరుగుతాయో చూడాలి.