కార్తికేయ తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే 'ఆర్ ఎక్స్ 100' తరువాత ఆయనకి ఆ స్థాయి హిట్ మాత్రం పడలేదు. దాంతో ఆయన సాధ్యమైనంత త్వరగా ఒక హిట్ కొట్టాలనే గట్టి పట్టుదలతో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన శ్రీ సరిపల్లి దర్శకత్వంలో 'రాజా విక్రమార్క' సినిమాను చేశాడు. 88 రామారెడ్డి నిర్మించిన ఈ సినిమాను, ఈ నెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన బిజీగా ఉన్నాడు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఒక రోజున నాకు కథ చెప్పడానికి శ్రీ సరిపల్లి వచ్చాడు. ఆయన చెప్పిన కథ వినగానే నాకు నచ్చింది. అంతేకాదు శ్రీ టాలెంట్ పై నాకు నమ్మకం కలిగింది. అందుకే కథ విషయం అలా ఉంచితే నువ్వు నచ్చావ్ .. నీతో వర్క్ చేయాలనిపిస్తోంది అని చెప్పాను. స్క్రిప్ట్ పై ఆయనకి మంచి అవగాహన ఉంది. ఎక్కడ ఏది తక్కువవుతుందో .. ఎక్కడ ఏది ఎక్కువవుతుందో ఆయనకి బాగా తెలుసు. ఈ సినిమా యాక్షన్ ప్రధానంగా సాగే కథే అయినా, కామెడీ .. హీరోయిన్ తో ఉండే రొమాంటిక్ సీన్స్ జనానికి బాగా నచ్చుతాయి. ఆ సీన్స్ ను నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను.
'ఆర్ ఎక్స్ 100' తరువాత నాపై ఒక్కసారిగా అంచనాలు పెరడగంతో, ఆ తరువాత సినిమాల విషయంలో కొంత ఇబ్బంది పడ్డాను. అయితే ఆ సినిమా నాకు మైనస్ అయిందని నేను అనుకోవడం లేదు. ఆ సినిమా నాకు లైఫ్ ఇచ్చింది .. ఆ సినిమా లేకపోతే నేను లేను. నాకు ఈ మాత్రం పేరు రావడానికి .. నిర్మాతలు రావడానికి ఆ సినిమానే కారణం. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ ను కాపాడుకుంటూ రావడానికి కొంత సమయం పట్టింది. అందుకే నేను డిఫరెంట్ రోల్స్ చేసుకుంటూ వచ్చాను. ఒక నటుడిగా అవి నన్ను కాపాడుతూ వచ్చాయి. డాన్స్ బాగా చేస్తాడు .. ఫైట్స్ బాగా చేస్తాడు అనే పేరు తెచ్చుకున్నాను.
'రాజా విక్రమార్క' సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా షూటింగు పూర్తికావొస్తున్నా టైటిల్ ను ఏమీ అనుకోలేదు. అందరూ కూడా దర్శకుడి పేరుతో 'శ్రీ సినిమా' అని పిలుచుకోవడం మొదలుపెట్టారు. శ్రీ ఒకటి రెండు టైటిల్స్ చెప్పాడుగానీ యావరేజ్ గా అనిపించాయి. ఈ సినిమాలో నా పాత్ర పేరు 'విక్రమ్'. అందువలన ఆ పేరుకు దగ్గరగా టైటిల్ పెట్టాలని అనుకున్నాం. ఆ తరువాత ఒక రోజున శ్రీకి కాల్ చేసి 'రాజా విక్రమార్క' టైటిల్ అయితే ఎలా ఉంటుందని అడిగాను. విక్రమ్ పాత్రకి తగినట్టుగా ఉంటుందని చెప్పాను. ఆయనతో పాటు నిర్మాతలకి కూడా నచ్చడంతో అదే ఖాయమైపోయింది" అని చెప్పుకొచ్చాడు.