``పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలి. ఎంతగా ఆపి ఉంచితే అంత బలంగా కొట్టాలి. అప్పుడే పరిస్థితులు దారికొస్తాయి!!``.. ఇప్పుడు నిఖిల్ చేసింది అదే. చాలా కాలం క్రితమే `కార్తికేయ 2` సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అయ్యింది. బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ కాబట్టి అతడు ఎంతో ధీమాగానూ ఉన్నాడు.
కానీ టాలీవుడ్ లో ఉన్న కొన్ని పరిస్థితుల వల్ల ఈ సినిమా రిలీజ్ కి లైన్ క్లియర్ కాలేదు. అదే క్రమంలో యువహీరో నిఖిల్ కాస్త ఉద్వేగానికి లోనయ్యారు. కెరీర్ లో తొలిసారి ఏడుపొచ్చినంత పనైందంటూ ఆయన ఎగ్జిబిషన్ రంగంలో ఉన్న అవ్యవస్థ గురించి కూడా బయటికే ఆవేదన వెల్లగక్కారు.
లేటయితే అయ్యింది.. బ్రేకులు వేసినంత మాత్రాన ఆగలేదు. టైమ్ వచ్చింది ఇప్పటికి. కాస్త ఆలస్యమైనా కానీ కార్తికేయ 2 థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకి రిలీజ్ డే అంతా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. టాలీవుడ్ సమీక్షకుల నుంచి కామన్ జనం వరకూ ప్రతి ఒక్కరూ ట్విట్టర్ సహా సోషల్ మీడియాల్లో `కార్తికేయ 2` మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఒక అద్భుతమైన థ్రిల్లింగ్ మూవీని వీక్షించామని రివ్యూలు రాసారు. ఇది నిజంగా నిఖిల్ కి ఎంతో ఓదార్పు అని చెప్పాలి.
లేటుగా వచ్చినా లేటెస్టుగా బంపర్ హిట్టు కొట్టాడు నిఖిల్. ఇక కార్తికేయ 2కి ఒక రోజు ముందు వచ్చిన మరో యువహీరో సినిమాకి యావరేజ్ మార్కులే వేయడంతో ఇక రేస్ లో నిఖిల్ హవాకి ఎదురుండదని ట్రేడ్ విశ్లేషిస్తోంది. కార్తికేయ 2 హిట్టు కొట్టడంతో ఈ ఫ్రాంఛైజీ నుంచి మరిన్ని సినిమాలు తెరకెక్కేందుకు ఆస్కారం ఉందని అప్పుడే టాక్ మొదలైంది. ఇది చందూమొండేటికి కూడా క్లాస్ కంబ్యాక్ అని చెప్పాలి.
ఆసక్తికరంగా టాలీవుడ్ లో ఇటీవల పాజిటివ్ వైబ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆర్.ఆర్.ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత `బింబిసార`-`సీతారామం` చిత్రాలు బంపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి.
తెలుగు సినిమాకి మంచి రోజులు నడుస్తున్నాయి అనుకుంటుండగానే ఇప్పుడు నిఖిల్ కార్తికేయ 2 పాజిటివ్ టాక్ తో స్టార్టయింది. చూస్తుంటే టాలీవుడ్ లో హిట్ల శాతం పెరుగుతుండడం ఉత్సాహం పెంచుతోంది. నిర్మాతల మరింతగా సినిమాలు తీయడానికి ఎగ్జయిట్ అవుతారనడంలో సందేహం లేదు.