జయలలిత.. కరుణానిధి.. ఈ ఇద్దరి మధ్య ఉన్న వైరం ఈనాటిది కాదు. ఇంకే రాష్ట్రంలోనూ రెండు పార్టీల అధినేతల మధ్య ఇంత వైరం లేదు. ఉన్నా ఇంత సుదీర్ఘకాలం సాగలేదు. అయితే... వారిద్దరి నేపథ్యం కూడా ఒకటే. ఇద్దరూ కూడా సినీరంగం నుంచే రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. 140కి పైగా సినిమాల్లో నటించిన ఘనత పురచ్చితలైవిది కాగా... తమిళ సినీరంగంలో పేరు మోసిన స్క్రిప్ట్ రైటర్ కరుణానిధి. ఆయనతో తమ సినిమాలకు స్క్రిప్ట్ రాయించుకోవడానికి దర్శకులు - నిర్మాతలు పోటీ పడేవారు. అలాంటి కరుణానిధి జయ సినిమాకూ ఓ సందర్భంలో మాటలు రాశారు.
జయలలిత 1965లో 'వెన్నిర అడై' అనే సినిమాతో జయ తమిళంలో ఆరంగేట్రం చేశారు. అయితే, ఆ సమయానికి కరుణానిధి సినిమాలకు పనిచేయడం మానేసి - పూర్తి స్థాయి రాజకీయాలలోకి వచ్చారు. కానీ, 1966లో ఎస్ రాజేంద్రన్ దర్శకత్వంలో వచ్చిన 'మణి మకుటం' సినిమా వీరిద్దరూ కలసి పని చేశారు. ఈ సినిమాలో జయ సెకండ్ హీరోయిన్ పాత్ర పోషించింది. ఈ చిత్రానికి కరుణానిధి స్క్రిప్ట్ అందించారు.
అప్పటికి జయ ఇంకా రాజకీయాల్లోకి రాలేదు. భవిష్యత్తులో ఇద్దరూ బద్ధ విరోధులవుతారని ఎవరూ ఊహించలేదు. అనంతర కాలంలో ఇద్దరూ తమిళనాడులో ప్రధాన నేతలుగా ఎదిగి ఆజన్మ శత్రువుల్లా మారిపోయారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/