కోలీవుడ్ క్రేజీ హీరో ధనుష్ , సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య విడాకుల వార్త ఇప్పుడు కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో ఏ స్టార్ ని కదిపినా విడాకులపై హాట్ హాట్ చర్చ జరుగుతోంది. గత కొన్నేళ్లుగా అన్యోన్యంగా జీవనం సాగించిన ధనుష్ - ఐశ్వర్య ఉన్నట్టుండి విడాకులు తీసుకుంటున్నామంటూ ప్రకటించడం దక్షిణాది సినీ సెలబ్రిటీలతో పాటు ఉత్తరాది ఫిల్మ్ స్టార్స్ ని కూడా విస్మయానికి గురిచేస్తోంది.
ఆకస్మాత్తుగా ధనుష్ - ఐశ్వర్య విడాకులు ప్రకటించడంతో కోలీవుడ్ సర్కిల్స్ లో పలు ఆసక్తికరమైన కథనాలు వైరల్ అవున్నాయి. గత కొంత కాలంగా వీరు విడిపోకుండా రజనీనే అడ్డుకుంటూ వచ్చారని, ఇద్దరి మధ్య మనస్పర్థలు పతాక స్థాయికి చేరడం వల్లే తాజాగా వీరు విడాకులు తీసుకుంటున్నామంటూ ప్రకటించారని ప్రచారం మొదలైంది. అయితే ధనుష్ - ఐశ్వర్య విడాకుల పై ధనుష్ తండ్రి కస్తూరి రాజా స్పందించారు.
కోలీవుడ్ మీడియాతో మాట్లాడిన ఆయన షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం విడిపోయామంటూ ప్రకటించిన ధనుష్ - ఐశ్వర్య మళ్లీ కలుస్తారని ఈ సందర్భంగా కస్తూరి రాజా స్పష్టం చేశారు. భార్యా భర్తల మధ్య గొడవలు జరగడం సహజం. ధనుష్ - ఐశ్వర్యల మధ్య అలాంటి గొడవలే చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం వారిద్దరు చెన్నైలో లేరు. హైదరాబాద్ లో వున్నారు. వారితో ఫోన్ లో మాట్లాడుతున్నాను. కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చాను.
రజనీకాంత్ కూడా విడాకులు విషయమై మరోసారి పరిశీలించాలని వారిని కోరారు. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా విడాకుల నిర్ణయాన్ని మార్చుకోవాలని చాలా మంది సెలబ్రిటీలు వారికి నచ్చ జెబుతున్నట్టు ఆయన వెల్లడించారు. అంటే గత కొంత కాలంగా ధనుష్ - ఐశ్వర్య మధ్య మనస్పర్థలు మొదలై గొడవలు జరుగుతున్న మాట వాస్తవమేనని ధనుష్ తండ్రి కస్తూరి రాజా అంగీకరించడం గమనార్హం.