కోలీవుడ్ యువ నటుడు.. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటి అల్లుడైన ధనుష్ తమ కొడుకేనంటూ గతంలో సంచలన ప్రకటన చేసిన మేలూరు వృద్ధుడు కదిరేశన్ తాజాగా మరో బాంబు పేల్చారు. ధనుష్ తమ కొడుకేనన్న విషయం రజనీకాంత్ కు కూడా బాగా తెలుసన్నారు. అయితే.. ఆ విషయాన్ని ఆయన బయటపెట్టటం లేదన్నారు.
గడిచిన రెండు రోజులుగా అభిమానులతో కలిసి ఫోటో సెషన్ ను నిర్వహిస్తున్న రజనీకాంత్.. తనను కలిసేందుకు వచ్చిన అభిమానులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తన అభిమానులందరూ తమ తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
రజనీ నోట ఈ మాట వచ్చిన వెంటనే కదిరేశన్ మీడియా ముందుకు వచ్చారు. తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలంటూ రజనీ సలహా ఇచ్చిన నేపథ్యంలో.. తన కొడుకును తన ఇంటికి పంపాల్సిందిగా రజనీకి ఆయన లేఖ రాశారు. తన భార్య అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉందని.. ప్రస్తుతం చికిత్స పొందుతుందని.. ఈ పరిస్థితుల్లో తమకు అండగా ఉండేందుకు తమ కొడుకును తన ఇంటికి పంపాల్సిందిగా ఆయన కోరారు.
తాము కష్టంలో ఉన్న వేళ.. తమకు అండగా ఉండాల్సిన కొడుకు.. అలా లేడన్న దిగులుతో తాము కుంగిపోతున్నట్లుగా పేర్కొన్నారు. తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకోవాలంటూ చక్కటి సలహా ఇచ్చిన రజనీకాంత్.. తమ కొడుకైన ధనుష్ ను తమ వద్దకు పంపేలా చర్యలు తీసుకోవాల్సిందిగా పేర్కొంటూ లేఖ రాశారు. కొద్దిరోజుల క్రితం ధనుష్ తమ కుమారుడంటూ కదిరేశన్ కోర్టులో కేసు వేశారు. దీనిపై ధనుష్ వర్గం స్టే తెచ్చుకుంది. హైకోర్టును ఆశ్రయించి కేసు నుంచి పూర్తిగా బయటపడినప్పటికీ.. తాజాగా మరోసారి మీడియా ముందుకు రావటం ద్వారా ధనుష్ ఇష్యూను తెర మీదకు తెచ్చారు.