38 లక్షల మంది కత్రినా కోసం వచ్చారు

Update: 2016-07-16 11:30 GMT
ఈరోజు సెక్సిణీ కత్రినా కైఫ్‌ 33వ పుట్టినరోజు. బాలీవుడ్‌ లో స్టారుగా పాపులర్ అవ్వడానికి ముందే.. అమ్మడు తెలుగులో మల్లీశ్వరి వంటి సినిమాలతో క్వీన్ గా పరిచయమైంది. కాస్త కాస్ట్ లీ గా తీసుకుంటోందని ఇక్కడ ఎక్కువగా ఆమెకు ఆఫర్లు ఇవ్వలేదేమో కాని.. యాక్టింగులో మెళకువలు మాత్రం టాలీవుడ్‌ లోనే నేర్చుకున్నా అంటూ స్వయంగా తనే చాలాసార్లు చెప్పింది.

ఇకపోతే ఈ అమ్మడు చాలాకాలం నుండి సోషల్ మీడియాలకు దూరంగానే ఉంది. హ్యాపీగా ముంబయ్ లో పని చేసుకోవడం.. రణబీర్‌ కపూర్ తో ఒక ఇంట్లో కలసి ఉండటం.. వీలు చిక్కినప్పుడు లండన్ వెళిపోయి అక్కడ తన తల్లి.. ఆరుగురు అక్కాచెల్లెళ్ళతో టైమ్ స్పెండ్ చేయడం.. ఇదే కత్రినాకు తెలిసిన ప్రపంచం. కాని బ్రేకప్ అయిపోయాక సీన్ మారింది. అమ్మడు మ్యాగజైన్ల కోసం బీభత్సంగా రెచ్చిపోవడం మొదలెట్టింది. అంతే కాదు.. గత రాత్రి సరిగ్గా 12 గంటలకు ఫేస్ బుక్ లో కూడా అడుగుపెట్టింది. ఈరోజు మధ్యాహ్నానికి అమ్మడుకు ఏకంగా 38 లక్షల మంది వెలకమ్ చెబుతూ.. ఆమె పేజీని లైక్ చేశారంటే చూస్కోండి.. ఇన్నాళ్ళూ కత్రినా ఎంత మిస్సయ్యింది.

ఒకపోతే తన ఇంట్లోని లాన్‌ ఎలా ఉంటుందో ఒక వీడియో పెట్టి చూపించింది కత్రినా. వావ్ అనేలా ఉంది ఆ లుక్ అంతా. ఏదేమైనా కూడా.. అమ్మడు మరిన్ని సినిమాలతో మరిన్ని హిట్లు కొట్టాలని ఆశిద్దాం. హ్యాపీ బర్తడే కత్రినా!!
Tags:    

Similar News