కపూర్ కుటుంబంతో ఫ్యామిలీ ఫోటో దిగింది

Update: 2015-12-30 22:30 GMT
కపూర్ ఫ్యామిలీలోకి కత్రినా కైఫ్ ఎంట్రీకి అంతా సిద్ధమవుతోంది. కపూర్ కుటుంబ సభ్యులతో కలిసి.. కత్రినా ఫోజులు ఇచ్చే స్థాయికి క్లోజ్ నెస్ పెరిగింది. రణ్ బీర్-కత్రినా కైఫ్ ల లవ్ ఎపిసోడ్ లో ఇదో టర్నింగ్ అని చెప్పచ్చు. ఇప్పుడు కైఫ్ తో కలిసి, కపూర్ లు దిగిన ఫోటో.. ట్విట్టర్ లో రౌండ్లు కొడుతోంది.

గతంలో రణ్ బీర్ తల్లి నీతు కపూర్.. కేట్ ను క్రాప్ చేసి, ఫోటోను ట్రిమ్ చేశారు. దీంతో కత్రినా ఎంట్రీకి ఆ ఫ్యామిలీ సిద్ధంగా లేదనే వార్తలు హల్ చల్ చేశాయి. కానీ కాలం గడిచేసరికి టెర్మ్స్ మారిపోతున్నాయి. క్రమంగా వారిలోనూ మార్పు కనిపిస్తోంది. ఆ బడా కుటుంబంలోని సభ్యులు కత్రినాతో కలిసి ఫోటో దిగేందుకు ఎలాంటి అబ్జెక్షన్స్ చెప్పడం లేదు. ప్రతీ ఏడు మాదిరిగానే.. క్రిస్మస్ లంచ్ ను ఏర్పాటు చేశారు రిషి కపూర్ ఫ్యామిలీ. ఈ కార్యక్రమానికి ఎక్కడెక్కడో ఉన్న కపూర్ లు మొత్తం హాజరయ్యారు. వీరితోపాటు కత్రినా కైఫ్ కూడా ఈ ప్రోగ్రాంలో భాగమైంది. లంచ్ అయిపోయక.. అందరూ ఫోటోలు దిగడం ఆనవాయితీ. కరిష్మా కపూర్ - కరీనా కపూర్ - సైఫ్ ఆలీఖాన్ - కరిష్మా కూతురు సమైరా - రణ్ ధీర్ కపూర్ - రణ్ బీర్ కపూర్ - కునాల్ కపూర్ లు.. కేట్ తో కలిసి ఫోటోలు దిగి, తమ అహ్వానాన్ని ఇన్ డైరెక్టుగా చెప్పేశారు.

దీంతో రణ్ బీర్-కత్రినాల పెళ్లి బాజాలు త్వరలో మోగుతాయనే టాక్ వినిపిస్తోంది. 2016లోనే వీరి మ్యారేజ్ డేట్ ఫిక్స్ కావచ్చనే అంచనాలున్నాయి. అయితే.. రణ్ బీర్ తల్లిదండ్రులైన రిషి కపూర్, నీతు కపూర్ లు మాత్రం.. కత్రినా కైఫ్ తో కలిసి ఫోటో దిగలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయినా సరే.. ఇంతవరకూ అయినా లాక్కొచ్చిన ఈ ప్రేమ జంటకి అభినందనలు చెప్పాల్సిందే.
Tags:    

Similar News