అత‌నికి క‌టీఫ్ చెప్పిన క‌త్రినా

Update: 2017-06-19 10:04 GMT
పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోవ‌టం.. ఒకే ఇంట్లో క‌లిసి ఉండే వ‌ర‌కూ వెళ్ల‌టం.. ఆ త‌ర్వాత కొంత కాలానికి ఎవ‌రి దారి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం బాలీవుడ్ సెల‌బ్రిటీలకు అల‌వాటే. 2011లో ర‌ణ్ బీర్ తో ప్రేమ‌లో మునిగిపోయి.. త‌ర్వాత రోజుల్లో ముంబ‌యిలోని బాంద్రాలో ఒకే అపార్ట్ మెంట్ లో క‌త్రినా క‌లిసి ఉండ‌టం బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.

ఏమైందో ఏమో కానీ వీరిద్ద‌రూ 2016 జ‌న‌వ‌రిలో విడిపోయారు. అప్ప‌టి నుంచి ఎవ‌రి దారిన వారు ఉండ‌టం మొద‌లు పెట్టారు. వీరిద్ద‌రు జంట‌గా తాజాగా జ‌గ్గా జాసూస్ న‌టించారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్ సంద‌ర్భంగా ఇద్ద‌రు క‌లిసి మీడియాతో మాట్లాడారు.

ఈ టైంలో క‌త్రినా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. తాను భ‌విష్య‌త్తులో ర‌ణ‌బీర్ తో క‌లిసి న‌టించేది లేద‌ని తేల్చేశారు. జ‌గ్గాలో ప‌ని చేసే టైంలో త‌న‌కు చాలా క‌ష్టంగా అనిపించింద‌ని.. అందుకే ఫ్యూచ‌ర్ లో ర‌ణ్ బీర్ తో జ‌త క‌ట్టేది లేద‌ని తేల్చేసింది. అమ్మ‌డు ఈ నిర్ణ‌యం తీసుకోవ‌టంలో ర‌ణ్ బీర్ ది  కూడా కార‌ణం ఉంద‌ని చెప్పాలి.

ఎందుకంటే.. ఈ సినిమా షూటింగ్ త‌ర్వాత క‌త్రినాతో క‌లిసి న‌టించ‌న‌ని చెప్పాడ‌ట‌. అందుకే క‌త్రినా కూడా అలాంటినిర్ణ‌య‌మే తీసుకుంద‌ట‌. అయితే.. ఇదే విష‌యాన్ని ర‌ణ్ బీర్ ను అడిగితే మాత్రం ఆ విష‌యం మీద మాట్లాడ‌కుండా మాట త‌ప్పించ‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News